సబ్ ఫీచర్

రక్షక భటులకు చుట్టూ సమస్యలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన పాలకులు స్వీయ రక్షణకు ఇస్తున్న ప్రాధాన్యం ప్రజారక్షణకు ఇవ్వడం లేదు. అందువల్లనే మన దేశంలో నేరాల సంఖ్య నానాటికీ ఆందోళనకరంగా పెరిగిపోతోంది. శాంతిభద్రతలు క్షీణించినా, నేరాలు పెరిగినా అందుకు మన రక్షక భటుల అసమర్ధతే కారణమని ఆరోపించడం మన పాలకులకు అలవాటు. ఇది కేవలం వాస్తవాలను మరుగున పడవేయడానికి వారు ఆడుతున్న నాటకం మాత్రమే. ప్రపంచంలో అత్యుత్తమ పోలీసు వ్యవస్థలలో మనది ఒకటి. అయితే, మన రక్షక భటులు సమర్ధవంతంగా పనిచేయడానికి వీలులేని పరిస్థితులు కల్పిస్తున్నది మన పాలకులే. ఎవరైనా సమర్థవంతంగా పనిచేయాలంటే వారిపై నిరంతరం వత్తిడి, అధిక పనిభారం ఉండకూడదు. మన దేశంలోని రక్షక భటులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు- తీవ్రమైన వత్తిడి, అధిక పనిభారం. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా కేంద్ర హోం మంత్రిత్వశాఖకు చెందిన ‘స్టాటిస్టిక్స్ బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్’ విడుదల చేసిన వివరాలే. సాధారణంగా అన్ని దేశాలలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రక్షక భటుల సంఖ్యను పెంచుతారు. కానీ, మన దేశంలో మాత్రం అవసరాలకు అనుగుణంగా రక్షక భటుల సంఖ్యను పెంచకపోగా, చాలాకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీచేయడం లేదు.
మన దేశంలో 90వ దశకంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ మంజూరు చేసిన మొత్తం రక్షక భటుల (పోలీస్ కానిస్టేబుల్) పోస్టులు 22,63,222 కాగా, వాటిలో 5,02,222 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే, మొత్తం పోస్టులలో 22 శాతం ఖాళీగా ఉన్నాయన్న మాట. పోలీసుశాఖలో ఒకవైపు ఖాళీల సంఖ్య పెరుగుతుండగా, మరోవైపు వ్యక్తిగత భద్రత కోరే నేతలు ఎక్కువ అయ్యారు. దీంతో, సాధారణ విధులు నిర్వహించే రక్షక భటుల సంఖ్య మరింతగా తగ్గిపోతున్నది. పాలక పక్షాలు కాకమ్మ కబుర్లు చెప్పడం మినహా, పోలీసుశాఖలో ఖాళీలను భర్తీచేయడానికి ఆశించిన రీతిలో చర్యలు తీసుకోవడం లేదు.
రక్షక భటుల పోస్టులకు సంబంధించి ఖాళీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు మంజూరు అయిన పోస్టులు 3.64 లక్షలు కాగా, 1.80 లక్షలు ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తం పోస్టులలో 49 శాతం ఖాళీగా ఉన్నాయన్నమాట. పశ్చిమ బెంగాల్‌లో 1.11 లక్షలు పోస్టులు ఉండగా, 35వేల ఖాళీలు, బీహార్‌లో 1.12 లక్షల పోస్టులు ఉండగా 30 వేల ఖాళీలు, కర్నాటకలో 1.07 లక్షల పోస్టులు ఉండగా, 25వేల ఖాళీలు, ఝార్ఖండ్‌లో 73.7 వేల పోస్టులు ఉండగా, 15 వేల ఖాళీలు, గుజరాత్‌లో 99.4 వేల పోస్టులు ఉండగా 15వేలు ఖాళీలు, తమిళనాడులో 1.35 లక్షలు పోస్టులు ఉండగా 16 వేల ఖాళీలు, చత్తీస్‌గఢ్‌లో 68వేలు పోస్టులు ఉండగా ఎనిమిదిన్నర వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రక్షక భటుల మీద పనిభారం పెరిగి, వారు తీవ్రమైన వత్తిడికి గురవుతున్నారు. ఒక్కోసారి వీరికి కడుపునిండా తిండి, కంటి నిండా నిద్రపోవడానికి కూడా అవకాశం లభించడం లేదు. దీంతో వారికి పలు ఆరోగ్య సమస్యలు కలుగుతున్నాయి. పలువురు రక్షక భటులు అకాల భోజనం, ఎక్కువ సేపు నిలబడాల్సి ఉండటం వలన గుండె, ఉదర సంబంధ, నరాల వ్యాధులకు గురవుతున్నారు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు వత్తిడి, పనిభారం కారణంగా వారిలో ఒక విధమైన నైరాశ్యం ఏర్పడుతున్నది. దీని కారణంగానే మన దేశంలో రక్షక భటులు పూర్తిసామర్థ్యంతో పనిచేయలేక పోతున్నారు.
మన దేశంలో సరైన ఉపాధి లేక కోట్లాది మంది యువత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తీవ్రవాద సంస్థలు, మావోయిస్టులు ఇటువంటి వారిని ఆకర్షించి, వారిచేత విధ్వంసకాండ జరిపిస్తున్నారు. పోలీసుశాఖలో ఖాళీగాఉన్న పోస్టులను భర్తీచేస్తే యువత అరాచకశక్తుల వలలో పడకుండా కొంతవరకు నిరోధించవచ్చు. రక్షక భటులపై పనిభారం తగ్గితే వారు మరింత సమర్ధవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పోలీసుశాఖలో తగినన్ని వాహనాలు కూడా లేవు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రతి వందమంది రక్షక భటులకు సగటున 10 వాహనాలు ఉన్నాయి. అందులో పనిచేసేవి ఎన్నో, పనిచేయనివి ఎన్నో ఎవరికీ తెలియదు. మరో విచిత్రం ఏమిటంటే దేశంలో 188 పోలీసుస్టేషన్‌లకు ఒక్క వాహనం కూడా లేదు. 402 పోలీసుస్టేషన్‌లకు టెలిఫోన్ సౌకర్యం, 134 పోలీసుస్టేషన్‌లలో వైర్‌లెస్ సెట్లు లేవు. ఇటువంటి ప్రతికూల పరిస్థితులలోకూడ ఎంతో సమర్ధవంతంగా పనిచేస్తున్న మన రక్షక భటులు అభినందనీయులు. పాలకపక్షాలు ఇకనైనా కళ్లు తెరచి పోలీసుశాఖలో ఖాళీలను భర్తీచేయనిదే, దేశంలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టవు. ఖాళీల భర్తీతోనే రక్షక భటులకు తిప్పలు తప్పుతాయి.

- పి.మస్తాన్‌రావు