సబ్ ఫీచర్

మేధస్సు నుంచి కొత్తదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గది సమస్యలకు పరిష్కారం చెప్పే స్థలం కాదని తెలిసినా, అక్కడ సమస్యలు ఎలా ఉత్పన్నవౌతాయి? సమస్యలు, పరిష్కారాలకు తరగతి గది పరిధి కానే కాదు. ప్రతి సమాజం తన సమస్యలను తనకున్న ఆలోచనలతో పరిష్కరిస్తుంది. సమస్యలకు తగ్గ ఆలోచనలు ఉంటాయి. సమస్యలు వేరు, ఆలోచనలు వేరు. ఏ సమస్యకైనా పరిష్కారం సమాజమిచ్చిన మార్గం. కొలంబస్ అమెరికా దేశాన్ని కనుక్కోకముందు స్పెయిన్ నుంచి అమెరికాకు రోడ్డు మార్గం లేదు. కొలంబస్ తాను వేసిన రోడ్డు వెంబడి ప్రయాణం చేయలేదు. ఇలాగే, కొంతమంది విద్యార్థులకు ఎవరో వేసిన బాట వెంట ప్రయాణం చేసే అలవాటు ఉండదు. వారు నిరంతరం కొత్త మార్గాలను వెతుకుతుంటారు.
మార్గాలను అనే్వషించే లక్షణం ఆలోచనా పరిజ్ఞానం నుంచి వస్తుంది. ఒక తరం వేసిన మార్గాన్ని అనుసరించకుండా ఎవరికీ కనపడని మార్గాలను ఆలోచనాపరులైన విద్యార్థులు వెతుకుతారు. నూతన మార్గాలను కనుక్కోవటమే అసలైన చైతన్యం. అది విద్యార్థిలో సమృద్ధిగా ఉంటుంది. ఒక్కోసారి ఉపాధ్యాయునికి కనపడని మార్గం విద్యార్థికి కనిపిస్తుంది. ఉపాధ్యాయుడు పుస్తకంలో వేసిన మార్గాన్ని మాత్రమే తరగతి గదిలో విద్యార్థుల ఎదుట వ్యక్తీకరిస్తాడు. కానీ, విద్యార్థి మాత్రం తనకు ఎదురైన సమస్య గురించి కొత్తగా, విభిన్నంగా ఆలోచిస్తాడు. ఆ విద్యార్థి మెదడు నుంచి వచ్చింది కొత్తది అవుతుంది.
నేను తరగతి గదిలో 10 స్టెప్స్‌తో సమాధానం చూపిస్తే, దాన్ని 4 స్టెప్స్‌తో చెబుతానని ఓ విద్యార్థి చెప్పాడు. ఇది ఏ పాఠ్య పుస్తకంలో లేదు. ఇది ఎవరూ ఇంతకుముందు చెప్పింది కూడా కాదు. ఇది పిల్లల ఆలోచనల నుంచి బయటకు వచ్చింది. ఉపాధ్యాయుడిచ్చిన సమస్యకు ఆ విద్యార్థి మేధస్సులో జరిగినటు రసాయనిక ప్రక్రియ కొత్తదారిని కనుక్కుంది. ఆలోచన అనేది పూర్తిగా వ్యక్తికి సంబంధించినది. ఆలోచన కాలానుగుణంగా మెరుగుపడుతూ ఉంటుంది. ఆలోచనే నవ చైతన్యానికి మూలం. నవీన ఆవిష్కరణలకు కేంద్ర బిందువు అవుతుంది.

- చుక్కా రామయ్య