సబ్ ఫీచర్

ముందస్తు ఎందుకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1990 మార్చిలో జరగాల్సిన శాసనసభ ఎన్నికలు ఐదు నెలల ముందు జరిగాయి. 2004 నవంబర్‌లో జరగాల్సిన ఎన్నికలు ఆరు నెలల ముందే జరిగాయి. ఈ రెండు ముందస్తు ఎన్నికల్లోనూ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది. ఇప్పుడు ప్రధాని మోదీ ఆలోచన మేరకు జమిలి ఎన్నికల్లో ఏపి అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగితే చరిత్ర పునరావృతం అవుతుందా? కాలపరిమితి ఉండగా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం సరికాదు. ప్రస్తుతం ఏపిలో రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, ఉద్యోగుల కేటాయింపు, విభజన సమస్యలు ఉండనే ఉన్నాయి. కొత్త పరిశ్రమల ఏర్పాటు, యువతకు ఉపాధి అవకాశాలు, ఇతర సంక్షేమ పథకాలు వంటివి ఎన్నికల నాటికి సాకారం అయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళితే అధికార పార్టీకి మేలు జరుగుతుందా? గనుక ముందస్తు ఎన్నికలకు దూరంగా ఉంటేనే మంచిది.
-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం
ఎన్నాళ్లీ ‘కాంట్రాక్టు’ పోస్టులు?
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్టు అధ్యాపకుల జీతాలు వంద శాతం మేరకు పెంచుతూ కెసిఆర్ సర్కారు నిర్ణయం తీసుకోవడం సరికాదు. తగినంత మంది విద్యార్థులు లేక అనేక ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మూతపడే పరిస్థితి కనిపిస్తోంది. డిగ్రీ కళాశాలలది గుడ్డిలో మెల్ల పరిస్థితి. కార్పొరేట్ కళాశాలల దెబ్బకు ప్రభుత్వ విద్యావ్యవస్థ నానాటికీ డీలా పడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2000 సంవత్సరంలో అప్పటి సిఎం చంద్రబాబు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతి ప్రవేశపెట్టారు. ప్రారంభంలో తక్కువ వేతనాలు ఉండడంతో ఈ పోస్టులకు పోటీ తీవ్రంగా ఉండేది కాదు. నిజానికి కాంట్రాక్టు అధ్యాపకుల పోస్టులన్నీ మంజూరైన, భర్తీకాని పోస్టులే. వీటిని కొత్త విద్యాసంవత్సరంలోనైనా భర్తీ చేసేందుకు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి.
-వి.జయకృష్ణ, తిరుపతి
రాజకీయం వద్దు
ఈమధ్య పాక్ ముష్కర సైనికులు మన దేశానికి చెందిన ఇద్దరు జవాన్లను హతమార్చి, మృతదేహాలను ఛిద్రం చేసిన ఘటన యావద్భారత దేశాన్ని కలవరపరిచింది. పాక్‌కి సరైన బుద్ధి చెప్పాలని భారతావని ఎలుగెత్తింది. అయితే ‘చేతులకు గాజుల తొడుక్కున్నారా? చర్యలు తీసుకోరా?’ అంటూ కాంగ్రెస్ బిజెపిని నిందించడం గురివింద చందంగా ఉంది. గతంలో యుపిఎ హయాంలో పాక్ సైనికులు మన జవాన్లు ఐదుగురిని చంపి వారి తలలు నరికి తీసుకుపోయారు. కొద్ది కాలం తర్వాత ఒక పాక్ ప్రముఖునికి బిర్యానీ విందు ఇచ్చింది కాంగ్రెస్ మంత్రేనని భారతీయులింకా మరువలేదు. ప్రతీ విషయాన్నీ రాజకీయ కోణంలో విమర్శించడం సబబు కాదు.
-సుభాష్, కాకినాడ