రాష్ట్రీయం

ప్రాథమిక లక్ష్యాలు సాధిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరీక్షల విధానంపై దృష్టి పెట్టాలి
గ్రామీణ అక్షరాస్యత బలోపేతం
నూతన విద్యావిధానంపై కసరత్తు
అఖిలపక్ష సమావేశంలో కడియం చర్చ

హైదరాబాద్, డిసెంబర్ 28: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యావిధానంపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ప్రాథమిక విద్యలో లక్ష్యాలను సాధించడం, ఉన్నత మాధ్యమిక విద్యలను అందరికీ చేరువ చేయడం తదితర అంశాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వివరించారు. వృత్తి విద్య, పాఠశాల విద్య పరీక్షల విధానం, నైపుణ్యంతో కూడిన టీచర్లను రూపొందించే క్రమంలో ఉపాధ్యాయ విద్య పునర్వ్యవస్థీకరణ, గ్రామీణ అక్షరాస్యతను త్వరితం చేయడం, ప్రత్యేకించి మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకు విద్యను అందించడం, వయోజన విద్య, సార్వత్రిక విద్య, సమాచార సాంకేతిక పరిజ్ఞానం ప్రోత్సహించడం, పాఠశాలల్లో సమాచార పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ప్రభుత్వ అభిప్రాయాలని ఈ సందర్భంగా కడియం శ్రీహరి పేర్కొన్నారు. సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించడం, విలువలు, వ్యాయామ విద్య, కళలు, జీవన కళలు గురించి ప్రోత్సహించడం, బాల్య విద్య గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అదేవిధంగా ఉన్నత విద్యపైనా ఆయన ప్రస్తావన చేశారు. క్వాలిటీ విద్యకు సుపరిపాలన, విద్యాసంస్థలకు ర్యాంకింగ్, క్వాలిటీ విద్య -నియంత్రణ వ్యవస్థలు, కేంద్రీయ విద్యాసంస్థలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాల స్థితి గతులను మెరుగుపరచడం, దూరవిద్యను ప్రోత్సహించడం, ప్రాంతీయ అసమానతలను తొలగించడం, లింగవివక్ష తగ్గించడం, సమాజానికి ఉన్నత విద్యకూ మధ్య అనుసంథానం, ఉత్తమ ఉపాధ్యాయులను ప్రోత్సహించడం నూతన జ్ఞాన సముదాయాలను అర్ధం చేసుకోవడం కూడా ఈ సందర్భంగా చర్చించారు. పలు ఎన్జీవోల నాయకులు, విద్యార్ధి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు.
** నూతన విద్యావిధానంపై అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి **