Others

పూర్ హన్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆఫ్ స్క్రీన్‌లోనూ.. అప్‌డేట్ స్టయిల్ అప్పీరెన్స్‌లో హన్సికా మోత్వానీకి పాఠాలు చెప్పాల్సిన పని లేదు. నడుస్తున్న ట్రెండ్‌ను ఒడిసిపట్టి, హాట్‌గా ప్రజెంట్ చేయడం మోత్వానీ స్టయలే వేరు. ప్రస్తుతం నడుస్తున్న ప్యాంట్‌సూట్ ట్రెండ్‌ను ప్రజెంట్ చేస్తూ చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైందట మోత్వానీ. -బబ్లీ నుంచి బక్కపల్చగా తయారైన ఈ బ్యూటీ ఈసారి ట్రెండ్‌ను ఫాలో అవ్వడంలో విఫలమైందంటున్నారు నెట్టింటి జనం. ప్యాంట్‌సూట్ డ్రెస్ కోసం స్కై బ్లూ కలర్ ఎంపిక చేసుకోవడమే పొరబాటు. పైగా జాకెట్ ఆమె ఫిట్‌నెస్‌లో బలహీనతనే చూపుతోంది. ఇక శాండిల్స్ ఎంపికలోనూ ట్రెండ్‌కు దూరంగానే ఉండిపోయందన్న కామెంట్లు ఇస్తున్నారు. బాలీవుడ్ ప్రయత్నాలు వికటించడంతో, సౌత్‌లోనే రాణించాలనుకున్న హన్సిక ఆశలూ, ఇప్పుడొస్తున్న కొత్తందాల ముందు పని చేయడం లేదట. ఇటీవలే 50వ సినిమా ‘మహా’ షూటింగ్ పూర్తి చేసిన హన్సిక, అర్ధ సెంచరీ చిత్రం విడుదల కోసం ఆత్రంగా చూస్తున్నానంటోంది. ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ విషయానే్న వెల్లడిస్తూ ‘నా కెరీర్‌లో 50వ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. నిజానికి ఈ సినిమా నా కెరీర్‌కు ఓ మైల్‌స్టోన్. ఎందుకంటే -మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రం మహా. ఈ తరహా పాత్ర పోషించడం కెరీర్‌లో ఇదే తొలిసారి. ఇప్పటివరకూ నేను చేసిన, ఎంపిక చేసుకున్న పాత్రలన్నింటికీ ఇది భిన్నం. ఎప్పుడు విడుదలవుతుందా? అని ఎదురు చూస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. ‘మహా’ వర్కవుటైతే మరికొన్ని అవకాశాలు రాకపోతాయా? అన్నది హన్సిక్ ఆశ, ఆలోచన.