క్రైమ్/లీగల్

సూరత్ వాటర్ ఫాల్స్‌లో పడి రాజవొమ్మంగి బీటెక్ విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, అక్టోబర్ 7: గుజరాత్ రాష్ట్రం సూరత్ నిట్‌లో బీటెక్ చదువుతున్న రాజవొమ్మంగి విద్యార్థి సూరత్‌కు 120 కి.మీ. దూరాన ఉన్న గిర వాటర్ ఫాల్స్‌లో పడి మృతిచెందిన సంఘటన మండలంలో విషాదం నింపింది. రాజవొమ్మంగి గ్రామానికి చెందిన కనిగిరి సాయిప్రవీణ్ శనివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో మరణించాడు. సాయి ప్రవీణ్ కంప్యూటర్ సైన్సు మూడో సంవత్సరం చదువుతున్నాడు. తోటి స్నేహితులతో పిక్నిక్‌కు వెళ్లిన ప్రవీణ్ కాలుజారి జలపాతంలో పడి మరణించాడని కుంటుంబ సభ్యులు తెలిపారు. ప్రవీణ్ తండ్రి కనిగిరి కనకారావు (దుర్గ) కాకినాడ ఎక్సైజ్ టాస్క్ఫోర్సు టీంలో హెచ్‌సిగా పనిచేస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన కనకారావుతోబాటు కుటుంబ సభ్యులు సూరత్‌కు బయలుదేరి వెళ్లారు. విమానంతో మృతదేహాన్ని సోమవారం నాటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరుగుతుందని కుటుంబీకులు తెలిపారు. పట్టుదలతో చదివి ఐఐటీ ఎంట్రెన్సులో ఉత్తీర్ణుడై సూరత్ నిట్‌లో సీటు సంపాదించుకున్న ప్రవీణ్ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడనుకున్న తరుణంలో ఈ సంఘటన జరగడంతో మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అత్యుత్తమంగా తమ కుమారుడు చదువుతున్నాడని, మరో ఏడాదిలో చదువు పూర్తిచేసుకుని ఉద్యోగం చేస్తాడనుకుని ఎన్నో ఆశలు పెట్టుకున్నామని ప్రవీణ్ తల్లిదండ్రులు గంగాభవానీ, కనకారావు కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. కనకారావు రెండో కుమారుడు విజయవాడలో ఇంటర్ చదువుతన్నాడు.