క్రైమ్/లీగల్

బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారేడుమిల్లి, నవంబర్ 21: మండలంలోని సున్నంపాడు గ్రామ పంచాయతీ సమీపంలో ఓ బస్సు బైకును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ డిపోకు చెందిన అల్ట్రా డీలక్స్ బస్సు బుధవారం భద్రాచలం నుండి కాకినాడ వెడుతూ సున్నంపాడు సమీపంలో ఓ ప్రమాదకర మలుపు వద్ద రంపచోడవరం నుండి మారేడుమిల్లికి వస్తున్న బైకును బలంగా ఢీకొట్టింది. మారేడుమిల్లిలో హెల్త్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న బిత్తరి యోహాను, అతని స్నేహితుడు జారగడ్డ లోవరాజు కలిసి బైకుపై మారేడుమిల్లి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బిత్తరి యోహాను కుడి కాలు శరీరం నుండి వేరై బస్సు కింద పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. లోవరాజుకు ఎడమ కాలు విరిగిపోగా, తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మారేడుమిల్లి పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రంపచోడవరం 108 అంబులెన్సులో లోవరాజును, మారేడుమిల్లి అంబులెన్సులో యోహానును రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై మారేడుమిల్లి ఎస్సై తులసీరామ్ కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.

తన కుమార్తెతో సహజీవనం వద్దన్నందుకే హత్య
వై రామవరం, నవంబర్ 21: నాటు తుపాకీ కాల్పుల్లో మృతిచెందిన మండలంలోని రేగడిపాలెం గ్రామం రాకోట వీధికి చెందిన రాకోట ఆదిరెడ్డి (50) మృతదేహానికి బుధవారం ఉదయం అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రిలో సీఐ ఎ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. సోమవారం రాత్రి రాజవొమ్మంగి మండలం దూసరపాము గ్రామానికి చెందిన ఇళ్ళాపు దారబాబు అనే వ్యక్తి ఆదిరెడ్డిని నాటు తుపాకీతో కాల్చి హతమార్చాడు. మండలంలో లోతట్టు ప్రాంతం కావడంతో పోలీసులకు మంగళవారం సాయంత్రానికి ఆలస్యంగా సమాచారం అందింది. దీంతో సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనికి సంబంధించి సీఐ తెలిపిన వివరాల ప్రకారం ఆదిరెడ్డి రెండో కుమార్తెతో దారబాబు కొంతకాలంగా సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఇలా చేస్తే తన కుటుంబం పరువు పోతుందని పెద్దలకు తెలియజేసి తన కుమార్తెను వివాహం చేసుకోమని ఆదిరెడ్డి అడిగాడు. దీంతో ఆగ్రహించిన దారబాబు అతని వద్దనున్న నాటు తుపాకీతో ఆదిరెడ్డిని కాల్చగా ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తూ, అతనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. మృతదేహాన్ని బుధవారం సాయంత్రం మృతుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కార్యక్రమంలో ఎస్సై ఎన్ సతీష్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.