ఆంధ్రప్రదేశ్‌

ఉత్తరాంధ్రలో కరంటు కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: పవర్ గ్రిడ్‌లో పదే పదే సాంకేతిక లోపాలు తలెత్తడంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో రెండు రోజులుగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పలు విద్యుత్ సబ్ స్టేషన్లలో, ఫీడర్లలో సాంకేతిక ఇబ్బందుల వల్ల అనధికారికంగా విద్యుత్ కోతను అమలు చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకూ విద్యుత్ సరఫరా లేనందున జనం ఉక్కపోతతో అలమటించారు. ప్రస్తుత వేసవిలో గంటల తరబడి విద్యుత్ సరఫరాలో కోతలు విధిస్తున్నారని, ఈ విషయమై అధికారులను ప్రశ్నిస్తే సాంకేతిక సమస్యలు తలెత్తాయని సమాధానం ఇస్తున్నట్లు జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి పూట పూర్తిగా విద్యుత్ సరఫరా లేనందున పల్లెలు అంధకారంలో మగ్గుతున్నాయి.