ఆంధ్రప్రదేశ్‌

ఏనుగుల సంచారం.. జనం భయాందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతపట్నం, మార్చి 14: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం శోభ పంచాయతీలోని శోభ కాలనీ, కొమనాపల్లి, ఈదలగూడ గ్రామాల్లో సోమవారం ఏనుగులు భయానక వాతావరణం సృష్టించాయి. గత కొద్దిరోజులుగా గాదిలోవ గ్రామ సమీపంలోని కొండపై తిష్టవేసిన ఏనుగులు ఒక్కసారిగా గ్రామాలపై పడ్డాయి. జీడి, మామిడి తదితర పండ్ల తోటలను ఏనుగుల గుంపు ధ్వంసం చేసింది.
దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. గతంలో చాలాసార్లు ఏనుగులు గ్రామాలపై పడి నానా బీభత్సవం సృష్టించాలని ప్రజలు తెలిపారు. విషయాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని ఏనుగులు గ్రామాల వైపు రాకుండా చూడాలని కోరుతున్నారు.

రాయదుర్గంలో రెండు చిరుతలు మృతి
రాయదుర్గం, మార్చి 14: అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం రాతిబావంక గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో రెండు చిరుత పులులు మృతిచెంది పడి ఉండటాన్ని గ్రామస్థులు సోమవారం ఉదయం గుర్తించారు. వెంటనే వారు సమాచారం ఇవ్వడంతో డిఎఫ్‌ఓ రాఘవయ్య, కళ్యాణదుర్గం రేంజర్ షేక్షావలి, డిప్యూటీ రేంజర్ శ్రీపతినాయుడు, అటవీ శాఖ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతల కళేబరాలను పరిశీలించారు. అలాగే అక్కడే పశు వైద్యుల చేత పోస్టుమార్టం చేయించారు. అనంతరం అటవీశాఖ అధికారులు విలేఖరులతో మాట్లాడుతూ విషాహారం లాంటి మాంసం తినడం వల్లే చిరుతలు మృతి చెంది వుండవచ్చునని, అవి రెండు తల్లిపిల్లలు అయి ఉంటాయని తెలిపారు. కాగా ఈ ప్రాంతంలో తరచూ చిరుతలు కనిపిస్తుండడంతో గ్రామస్థులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తమ పశువులు, మేకలు చిరుతలకు బలి అవుతున్నాయని వాపోతున్నారు. ఇకనైనా అటవీ శాఖ అధికారులు అడవి జంతువుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.