ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ ఆదాకు లక్ష పంపుసెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15.70 లక్షల వ్యవసాయ విద్యుత్ పంప్‌సెట్లు పనిచేస్తున్నాయని రాష్ట్ర కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శాసనమండలిలో సోమవారం టిడిపి సభ్యుడు టిడి జనార్దన్ తదితరులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి తరఫున అచ్చెన్నాయుడు సమాధానం చెబుతూ, విద్యుత్తు ఆదా చేసే పంప్‌సెట్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలాన్ని ఇందుకోసం పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామన్నారు. ఈ మండలంలో 20 కోట్ల రూపాయలతో ఐదు నక్షత్రాలు కలిగిన 2496 పంప్‌సెట్లను పాత మోటార్ల స్థానంలో బిగించామన్నారు. ఈ ప్రాజెక్టు సత్ఫలితాలను ఇచ్చిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని 2016-17 సంవత్సరంలో విద్యుత్తు ఆదా చేసే మరో లక్ష పంప్‌సెట్లను కొత్తగా ఏర్పాటు చేస్తామన్నారు. కృష్ణాడెల్టా ఆధునీకరణ కోసం 4,573 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నామని, మరో రెండేళ్లలోగా ఈ పనులు పూర్తవుతాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం 16,010 కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేసిందని సాగునీటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. 36 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులు 2018 వరకు పూర్తవుతాయన్నారు.