రాష్ట్రీయం

1.30 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రణాళిక వ్యయం రూ. 67,630.73 కోట్లు
ప్రణాళికేతర వ్యయం రూ. 62,785.14 కోట్లు
రెవెన్యూ మిగులు రూ.3,718 కోట్లు
ద్రవ్యలోటు రూ. 23,467 కోట్లు
ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం రూ. 72,412 కోట్లు
కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు రూ. 28,512 కోట్లు
బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి ఈటల రాజేందర్

హైదరాబాద్, మార్చి 14: తెలంగాణ రాష్ట్రం ఈ ఆర్థిక సంవత్సరానికి (2016-17) రూ. 1,30,415.87 కోట్ల అంచనా వ్యయంతో సోమవారం శాసనసభలో బడ్జెట్‌ను ప్రతిపాదించింది. ఇందులో ప్రణాళికేతర వ్యయం కింద రూ. 62,785.14 కోట్లు, ప్రణాళిక వ్యయం కింద రూ. 67,630.73 కోట్లకు ప్రతిపాదించింది. బడ్జెట్ ప్రతిపాదనలలో ప్రణాళికేతర వ్యయానికంటే ప్రణాళిక వ్యయానికి అధిక నిధులు కేటాయించడం ఈసారి విశేషంగా చెప్పుకోవచ్చు. పది జిల్లాలు కలిగిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఈ ఏడాది లక్షా 30 వేల కోట్ల పైచిలుకు కాగా, 13 జిల్లాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ లక్ష 35 వేల కోట్లు మాత్రమే కావడం మరో విశేషం. బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించడంలో మూస పద్ధతులకు స్వస్తిపలికి ప్రణాళిక వ్యయానికి నిధులు పెంచడం కొత్త ఒరవడిగా చెప్పవచ్చు. ప్రణాళికేతర వ్యయానికంటే ప్రణాళిక వ్యయానికి అధిక నిధులు కేటాయించి పాత ఒరవడికి స్వస్తిపలుకుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనకు అనుగుణంగా కేటాయింపులు జరిగాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవ వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ఉదయం 11.35 గంటలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో రెవిన్యూ మిగులు రూ. 3,718.37 కోట్లు, ద్రవ్యలోటు రూ.23,467.29 కోట్లుగా ఉంటుందని బడ్జెట్ ప్రతిపాదనలలో ప్రభుత్వం అంచనా వేసింది. అలాగే ద్రవ్యలోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.5 శాతంగా అంచనా వేసినట్టు ఆర్థిక మంత్రి ఈటల పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం రూ.72,412.23 కోట్లుగా అంచనా వేసింది. అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు రూ. 28,512.49 కోట్లుగా అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం రూ. 54,256.71 కోట్లు కాగా, కేంద్రం నుంచి రూ. 25,223.49 కోట్లు వచ్చినట్టు పేర్కొన్నారు.
ఇలా ఉండగా ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాలకు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాకరంగా చేపట్టిన మిషన్ భగీరథకుకానీ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికికానీ బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయం కింద నయా పైసా కేటాయించలేదు. అయితే ఈ రెండు పథకాలకు హడ్కో, నాబార్డు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకుల నుంచి రుణం తీసుకొని అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ముందు ప్రకటించిన విధంగా సాగునీటి రంగానికి, సంక్షేమ రంగాలకు బడ్జెట్‌లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. సాగునీటి రంగానికి అన్నింటికంటే ఎక్కువగా రూ. 25 వేల కోట్లు కేటాయించగా, సంక్షేమ రంగానికి రూ. 13,412 కోట్లు కేటాయించింది. బడ్జెట్‌లో తొలిసారిగా ప్రత్యేక అభివృద్ధి నిధికి (స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్) రూ.4,675 కోట్లు కేటాయించడం మరో విశేషం. కాగా, సాగునీరు, సంక్షేమ రంగాల తర్వాతి స్థానంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 10,731 కోట్లు, ఆ తర్వాత వ్యవసాయ రంగానికి రూ.6,759 కోట్లు కేటాయించగా, ఆరోగ్యరంగానికి కూడా ఈసారి బడ్జెట్‌లో అధికంగా రూ. 5,967 కోట్లను కేటాయించింది. మున్సిపల్, పట్టణాభివృద్ధికి రూ. 4,815 కోట్లు కేటాయించింది. సంక్షేమ రంగంలో భాగమైనప్పటికీ ఆసరా పింఛన్ పథకానికి విధిగా రూ.4,693 కోట్లు, కళ్యాణలక్ష్మి పథకానికి రూ.738 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి రూ.1,553 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమ నిధికి రూ. 100 కోట్లు కేటాయించింది. సంక్షేమ రంగానికి కేటాయించిన రూ. 13,412 కోట్లలో ఎస్‌సి సంక్షేమానికి రూ. 7,122 కోట్లు, ఎస్‌టి సంక్షేమానికి రూ.3,752 కోట్లు, బిసి సంక్షేమానికి రూ. 2,538 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ. 1,204 కోట్లు కేటాయించారు. ఆరోగ్యరంగానికి కేటాయించిన రూ. 5967 కోట్ల నుంచి హైదరాబాద్‌లో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించడంతో పాటు రాష్టవ్య్రాప్తంగా 40 డయాలసిస్, డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. అలాగే విద్యాశాఖకు ప్రణాళిక వ్యయం కింద కేటాయించిన రూ. 1,694 కోట్ల నుంచి మైనార్టీల కోసం 70 ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నట్టు పేర్కొన్నారు. రోడ్లు, భవనాలకు కేటాయించిన రూ. 3,333 కోట్లు నుంచి 4 వేల కిలో మీటర్ల కొత్త రహదారులు నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. పరిశ్రమలు, ఐటీ రంగానికి రూ. 967 కోట్లు కేటాయించగా, ఇందులో ఐటీ కమ్యూనికేషన్లకు రూ. 254 కోట్లు, సిసి టీవీల మానిటరింగ్‌కు రూ.225 కోట్లు ఖర్చు చేయనున్నట్టు పేర్కొన్నారు. అగ్నిమాపక శాఖకు రూ. 223 కోట్లు, సాంస్కృతిక, పర్యాటక రంగానికి రూ. 50 కోట్లు, మెట్రోరైలుకు రూ. 200 కోట్లు, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, కళాభారతి నిర్మాణానికి రూ. 457 కోట్లు కేటాయించింది.
ప్రత్యేక నిధికి రూ. 4,675 కోట్లు
బడ్జెట్‌లో శాఖల వారీగా నిధులు కేటాయించినప్పటికీ, ఆకస్మికంగా వచ్చే అవసరాలకు ప్రత్యేకంగా నిధులు ఎక్కడి నుంచి తీసుకోవాలో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో నిధులను వినియోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి నిధిని ఏర్పాటు చేసి దీనికి రూ. 4,675 కోట్లు కేటాయించింది. (చిత్రం) తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్