ఫోకస్

ఉన్నవాటిని బాగు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు తెరతీసే ముందు ప్రస్తుతం నడుస్తున్న విశ్వవిద్యాలయాలను బాగు చేయాలి. ‘ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతాన’ని అన్నట్టు ఉంది..కెసిఆర్ ప్రభుత్వ వ్యవహారం. ప్రభుత్వ నేతృత్వంలోని యూనివర్సిటీలను పటిష్టం చేసి, సమాజంలో పోటీకి సిద్ధం చేసి, ప్రైవేట్ యూనివర్సిటీల గురించి ఆలోచిస్తే బాగుండేది. ప్రభుత్వం నేతృత్వంలోని యూనివర్సిటీలను సమస్యల వలయంలోకి తోసివేసి, ప్రైవేట్ యూనివర్సిటీలకు అవకాశం ఇస్తామనడం సబబు కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఉస్మానియా యూనివర్సిటీ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తరహాలో, కాకతీయ యూనివర్సిటీ కేంబ్రిడ్జి యూనివర్సిటీ తరహాలో, ఇతర యూనివర్సిటీలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మారతాయని అంతా భావించారు. తెలంగాణ ఉద్యమమే ‘ఉపాధి, నిధులు, నీళ్లు’ అంశాలపై కొనసాగింది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులే కీలకంగా వ్యవహరించారు. ఉస్మానియాతో సహా వివిధ యూనివర్సిటీల విద్యార్థులు అనేక ఇక్కట్లకు గురయ్యారు. ఉపాధి అనగానే విద్యార్థులు-యువత కనిపిస్తారు. తెలంగాణ యూనివర్సిటీలు చాలా కాలంగా సిబ్బంది కొరత, నిధుల కొరతతో కొనసాగుతూ వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండున్నర ఏళ్లయినా ఈ యూనివర్సిటీల బలోపేతానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడి వంద ఏళ్లు గడవడంతో ఉత్సవాలకు 1000 కోట్ల రూపాయలు కేటాయించి భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తారని అంతా భావించారు. అమెరికా తదితర దేశాల నుండి విద్యార్థులకు తెలంగాణ యూనివర్సిటీలకు వచ్చి చదువుకునేలా యూనివర్సిటీలను రూపొందిస్తారని భావించారు. ప్రభుత్వ వ్యవహారం ఇందుకు వ్యతిరేకంగా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీకి ఇంత జాగా ఎందుకు అని కెసిఆర్ అన్నరోజే ఆయనపై విద్యావంతులకు, యువతకు, విద్యార్థులకు నమ్మకం పోయింది. విద్యావంతులతో, విద్యార్థి సంఘాలతో, రాజకీయ నేతలతో చర్చించకుండా ప్రైవేట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం శోచనీయం. యూనివర్సిటీలంటే ముఖ్యమంత్రికి సరైన అవగాహన లేదని స్పష్టమైంది.
నారాయణ, చైతన్య విద్యాసంస్థల ద్వారా ఎదురైన అనుభవం ఏమిటి? ఇవి కేవలం వ్యాపార దృక్పథంతోనే పనిచేస్తాయని, సామాజిక బాధ్యత లేదని స్పష్టం అయిందికదా! ఈ పరిస్థితిలో తెరాస ప్రభుత్వం తొలుత విద్యావంతులు, విద్యార్థుల విశ్వాసం చూరగొనాలి. విద్యార్థులను దోపిడీ చేసే విధంగా ప్రైవేట్‌కు అవకాశం ఇవ్వద్దు. ఒకటికి పదిసార్లు ఆలోచించి, అందరితో చర్చించి ప్రైవేట్ యూనివర్సిటీలపై ఒక నిర్ణయం తీసుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

- పి. మురళీ మనోహర్, విద్యారంగ నిపుణులు