మెయిన్ ఫీచర్

హాస్య పన్‌డితుడు పఠాభి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠాభి పన్ రాయడంలో సిద్ధహస్తులు. నిజానికి ఆ పన్ (ఒక మాటకు ఒక అర్థం ఉండగా, మరొక కొంటె అర్థం తీయం- ఆలోచిస్తే, అదీ సరైనదే అని అందరికీ అనిపించేలా ఆ పన్ ఉండడం). ఇది వక్రోక్తి పేరిట, భారతీయ సాహిత్యంలో ప్రాచీన పద్ధతే, అయితే ఆంగ్ల ప్రభావం గల ఆధునిక సమాజంలో ఆ మాటలు, మన మాటలు కూడా, ఈ వికట కవిత్వ ప్రతిభకు ఉపయోగిస్తాయి, ఇది దాదాపు ఆధునిక కవులందరిలో ఉన్నా - వీటిని 1980లో ‘‘పన్‌చాంగం’’ పేరిట తెచ్చిన కవి, హాస్య నిరంకుశుడు
పఠాభి మాత్రమే.

ఇరవై యేళ్ల వయసు.. ఇంటి పేరు తిక్కవరపు.. నడత తీరు పెడసరం, స్వభావం కవిత్వ పట్ట్భారామం - కృష్ణశాస్ర్తీకి వెక్కిరింత, పద్యాలకు నడుములు విరగదంతానని బెదిరింపు, మాటలు విరిచి పుస్తకం పొయ్యిలో పెట్టడం - ఏమంటే, ఇదే ఫిడేలు రాగాల డజన్ అని వినుతించిన ఆధునికులు, విస్తుపోయిన సాహిత్య లోకం, ఉలిక్కిపడ్డ సంప్రదాయం - ఒక్కడే - ఈ సుడిగాలి, ఒక్కడే ఈ వడమాలి, ఒక్కడే పఠాభి, ఒక్కటే గొడ్డలి దెబ్బ, ఇది సంగతులు కాదు సంఘ గతులు మోగించిన ఫిడేలు, ఆ ఫిడేలు రాగాలకు, ఆ ఫిడేలు శబ్దాలకు, నూరేళ్ల సందర్భం. పఠాభి ఫిరంగికి శత వత్సర ప్రారంభం ఫిబ్రవరి 19న.
‘‘ఎవ్వరని ఎంతురో నన్ను’’ ఇది కృష్ణశాస్ర్తీ 1925లో వెలువరించిన కృష్ణపక్షములో ‘‘నన్ను గని’’ కవితలో ఒక ప్రసిద్ధ వాక్యం. తన ఇరవై ఎనిమిదేళ్ల వయసులో, అంతకు ముందర కొనే్నళ్ల నుంచీ, తాను, బసవరాజు అప్పారావు, నండూరి సుబ్బారావు గీతాలు రాస్తుండగా, 1925లో ఈ గీతాలను ‘‘కృష్ణపక్షము’’ పేరిట ప్రచురణ చేశారు తల్లావఝల శివశంకర స్వామి ముందుమాటతో. ‘‘కృష్ణపక్షము’’ అనే మాట మొత్తం కవిత్వంలో ఎక్కడా కనిపించదు. జీవితపు చీకటి పార్శ్వము అనే అర్థంతోబాటే ‘‘కృష్ణ సమర్థనలో’’ (నేను కృష్ణపక్షం వహించాను అంటే ఏమి అర్థమో అదే) కూడా ఇన్ డిఫెన్స్ ఆఫ్ కృష్ణ - అంటే కృష్ణశాస్త్రే కదా - కూడా ఈ శీర్షికలో అంతరాళ ధ్వని.
శ్రీశ్రీ రాస్తున్న మహాప్రస్థాన గీతాలు దాదాపు ముందు మాట వరకూ వస్తాయి ఇంకొక ఏడాదిలో అంటే 1940లో చలంగారి ముందుకు జరుక్ శాస్ర్తీ ప్రమేయంతో. ఈలోగా నెల్లూరు కుర్రవాడు, మదరాసు జీవితం ఎరిగిన ఆధునిక స్వభావి, తిక్కవరపు పట్ట్భారామిరెడ్డి తన పేరు పఠాభిగా, తన మాట కుఠార ప్రహారంగా సాధించాడొక ఫిడేలు రాగాల డజను. దేశీయ, అంతర్జాతీయ సాహిత్యం చదువుకుని ఉండడం, టాగూర్ శాంతినికేతన్‌లో అశాంతి సమీరంలా తిరగడం - ఇవన్నీ కూడా ఈయనలో ఒక స్వేచ్ఛకు దారితీసాయి. ఈయన 1939లో ‘‘డజన్’’ అని పనె్నండు వచన పద్యాలు ఒక సంపుటిగా వేయడానికి, ఇరవయ్యేళ్ల ముందరే అటు తూర్పున రష్యాలో, ప్రముఖ సౌందర్యాత్మక అభివ్యక్తి గలవాడిగా చెప్పబడే అలెక్సాంద్రే బ్లాక్, ‘‘ది ట్వెల్వ్’’ అనే కవిత, రష్యన్ విప్లవోద్యమ ప్రతి శ్రుతులతో తీసుకొచ్చాడు. ఇరవయ్యో శతాబ్దపు కవిత్వ జాబితాలో అదొక అగ్రశ్రేణి రచన.
ఇంతకీ ఈ ‘‘్ఫడేలు రాగాల డజన్’’లో పనె్నండు వినిర్మాణ, విలక్షణ, విడ్డూర గీతాలు వెలువరించిన కవి పఠాభి వయసు ఆనాటికి ఇరవై ఏళ్ళే. శ్రీశ్రీ కన్నా తొమ్మిదేళ్లు చిన్న. కృష్ణశాస్ర్తీ కన్నా ఇరవై రెండేళ్లు చిన్న. ఈ పుస్తకం 1939 ఆగస్ట్‌లో చలంగారి ముందు మాటలతో వెలువడింది. ఈ మాటలు పుస్తకం లోపలకాదు, పుస్తకం అట్టపైనే ఉంటాయి. 1940లో శ్రీశ్రీ మహాప్రస్థానానికి ముందుమాట విస్తరించి రాసిన చలంగారు, ఇక్కడ నిజంగా లెక్కపెట్టదగ్గ మాటలే అట్ట పైనుంచి మనతో మాట్లాడారు.
ఈ పుస్తకాన్ని ఆయన తరువాత పట్టించుకోలేదు. ఇంకో రెండు కవిత్వ సంపుటాలు ‘‘కయిత నా దయిత’’ (1978), ‘‘పఠాభి పన్‌చాంగం’’ (1980) వేసినా, వాటిని చంకలో పెట్టుకుని అందరికీ ఇచ్చుకుంటూ, ఇంకా ఏవేవో ఆశించే బాపతు మనిషి కాదు. మూడు కవిత్వ పుస్తకాలు లోకానికి వదిలేసి, తాను సినిమా రంగంలో పడిపోయి, కన్నడ సినిమాకు తొలి స్వర్ణ నంది పురస్కారం లభించిన ‘‘సంస్కార’’ సినిమా నిర్మాతగా రాష్టప్రతి బంగారు పతకం పొందిన సినిమా ఇది. అప్పట్లో ఈ సినిమాతో బాటే పోటీలో ఉన్న సినిమా సత్యజిత్ రే తీసిన పథేర్ పాంచాలి కూడా. సంస్కార సినిమాలో ఎవరికీ మేకప్ ఉండదు, ఈయన భార్య, స్నేహలత పావెల్, ఈ సినిమాలో నాయిక పాత్ర పోషించింది. అప్పటికి గిరీష్ కర్నాడ్ కూడా ఎవరో పెద్దగా తెలీదు. కన్నడిగులు ఎంతగానో ప్రేమిస్తారు పఠాభిని. ఈ నవల రాసినది యు.ఆర్.అనంతమూర్తి. పఠాభి పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వ్యవస్థాపక సభ్యుడు కూడా.
ఈ రచనలో పిడేలు, రాగం జంట, వారి పెద్ద పఠాభి. ఈ నాంది ప్రస్తావనలో ఇరవయ్యేళ్ళ కుర్రవాడు, ఫిడేలు అమ్మాయికి, రాగాల అబ్బాయికి పుట్టిన పిల్లలు. తనను ‘‘తాతా, తాతా’’ అని పిలుస్తారు అని ముగిస్తాడు. ఈ రచనలో పదాలు ఏర్పడే క్రమాన్ని భంగపరిచాడు పఠాభి. అతి శ్లాఘిత, అతి కీర్తిత, అతి అభినందిత రచన ఫిడేలు రాగాల డజన్. తొలి ప్రచురణ తరువాత మలి ముద్రణలు లేకపోవడం మూలాన అతి తక్కువగా అందుబాటులో ఉండేది. అలాంటిది ఒక ప్రతి ధూళి ధూసరిత జీర్ణ శాసనంలా దొరికితే ఎంత ఆనందిస్తాము. ఈ ఆనందాన్ని చెప్తూ అలా ఒక కాపీ దొరికిన విజయనగరం కథకుడు, మంచి మిత్రుడు పంతుల జోగారావు కొనే్నళ్ల కింద ఇలా బ్లాగు ఆకాశంలో వేసారి వాపోయారు.
‘‘దీనికి టీకా టిప్పణులు చెప్పడానికి శ్రీశ్రీ లేడు. ఆరుద్రా లేడు. రోణంకీ లేడు. తెలిస్తే ఎవరయినా చెబుదురూ.... అప్పుడు... హా దొరికెన్! అని ఊరుకోకుండా, హా! తెలిసెన్! అని కూడా అనుకుంటాను. బాబ్బాబు! ఎవరయినా పుణ్యం కట్టుకుందురూ!
ముందుగా పఠాభి ఎలా మాటలు విరిచి ఒక వాక్య సముదాయం రాసారో అది -
ఫిడేలు రాగమ్ ఫిడేలు రాగమ్ ఫిడేలు రాగమ్బులు వినూతన పదప్‌రేమికులు, మహా కాముకులు, అన్‌యోన్‌యమగు దమ్‌పతులు కూడ. ఫిడేలన్ నది, ‘‘మయ్డియ ర్రాగా మీ వారన్దరు సనాతనాచార్ యుల్ ముఖమ్విరిచి, ఇన్ గ్ లీష్టానిని నన్‌ను నే్జపట్ టవద్ దని గద్ దిన్చినా కూడ నీవు మహా సాహసన్తో, రుమాన్‌టిక్ గా మ్ యారేజ్జేసుకొన్ నావు గదా! స్ వీట్ హార్ ట్! ‘‘రాగమ్ అనినాడు’’ థ్ యాన్ క్ స్ టు పఠాభి నా కతడు ధయ్రిన్గా సహాయమ్ జేయ పట్ టి మనకు వివాహమయిన్‌ది డార్‌లిన్‌గ్! ‘‘్ఫడేలు రాగమ్బులు అదర్ శమగు దమ్ పతులు తటాల్‌మని కలకన్‌ఠమున, ఫిడీలిలా ప్శ్‌న్రిన్‌చినది. ‘‘రాగా డియర్నన్‌ను నిజన్గా ప్‌రేమిస్‌తావా నీవు? ఏమ్ మాటన్టున్నావు ఫిడేలీ జీవితేశ్‌వరీ! నా జన్‌మ నీలో లీనమయి పోయిన్ది, సన్‌ఘమ్ నన్ వినా గూడా నిన్ను చేపట్టినన్ దుక్నాకు, వచిమ్పరాని సవుఖ్‌యమ్’’ ఫిడీలు చిత్ తతస్త్రులు ఆపనందంతో మ్‌రోగినవి. రాగమ్ అంత ఫిడీలీని గాఢమ్‌గా కవ్గిలించాడు. తర్వాత వారి దేహాలు నే్నకమయినాయి సరళ శయ్యన్. అపూర్ వమ్ బగు అన్దంబగు సన్తానమ్ వారికి జనిన్చి అసన్ ఖ్ యాకముగ; - వారన్తా పఠాభిని గని ‘‘ తాతా తాతా’’ అనేవారు.’’
ఇప్పుడు ఇది సరైన తెలుగులోకి మారిస్తే, మా జోగారావు కోరినట్టుగా ఈ డడ (అంటే ఒ్ద్ఘఆఆళూళజూ ౄళఒఒ్ఘ్ళ ఒఆ్ఘఆఖఒ) ఎనభై ఏళ్ల కిందటే పఠాభి రాసింది, మనకు అర్థం అవుతుంది.
అయ్యా జోగారాయా - అవధరించండి ఇదే పైన డీ కన్‌స్ట్రక్ట్ (జూళష్యశఒఆఖషఆ) అయిన (వినిర్మాణమైన లేదా, మామూలు తెలుగులో అయితే కావాలని పఠాభిచే, గుణిత క్రమం విరగొట్టబడిన మాటల స్పేర్ పార్టులన్నీ కలిపితే, ఒక పేరా వాక్య సమూహం అవుతుంది. పద్యాల నడుములు ఏమో కానీ, పదాల నడుములు మాత్రం విరగ్గొట్టాడు పఠాభి. (వచన పద్యాలన్నాడు కనుక - పద్యాలంటే ఒక విధంగా గౌరవం ఉన్నట్టే కదా)
‘‘్ఫడేలు రాగం ఫిడేలు రాగం ఫిడేలు రాగంబులు వినూత్న పద ప్రేమికులు, మహా కాముకులు; అన్యోన్నమగు దంపతులు కూడ; పిడేలన్నది, ‘‘మై డియర్ రాగా, మీ వారందరు సనాతనాచార్యులు ముఖం విరిచి ఇంగ్లీష్ దానిని నన్నున్ చేపట్టవద్దని గద్దించినా కూడా నీవు మహా సాహసంతో, రొమాంటిక్‌గా మారేజ్ చేసుకొన్నావ్ గదా! స్వీట్ హార్ట్!’’
రాగం అన్నాడు ‘‘్థంక్స్ టు పట్ట్భా, నాకాతడు ధైర్యంగా సహాయం చేయబట్టి మనకు వివాహమైనది డార్లింగ్!’’
ఫిడేలు రాగంబులు ఆదర్శమగు దంపతులు. తటాల్ మని కలకంఠమున ఫిడేల్ ఇలా ప్రశ్నించినది ‘‘రాగా డియర్, నన్ను నిజంగా ప్రేమిస్తావా నీవు? ఏం మాటలంటున్నావు ఫిడెలీ జీవితేశ్వరీ! నా జన్మ నీలో లీనమయిపోయింది. సంఘం నవ్వినా గూడా నిన్ను చేపట్టినందుకు నాకు వచింపరాని సౌఖ్యం. ‘‘్ఫడెల్ చిత్త తంత్రులు ఆనందంతో మ్రోగినవి. రాగం అంత ఫిడిలీని గాఢంగా కౌగిలించాడు. తర్వాత వారి దేహాలున్ ఏకమైనాయి సరళ శయ్యన్. అపూర్వమగు అందమగు సంతానం వారికి జనించి అసంఖ్యాకముగ, వారంతా పఠాభిని గని, ‘తాతా, తాతా అనేవారు’.
‘‘కయిత నా దయిత (1978) కవిత్వ సంపుటిని తన భార్య, స్నేహలత, ప్రతిభావంతమైన నటి, తమిళ - బెంగాలి క్రిస్టియన్ యువతి. ఎమర్జెన్సీ కాలంలో దమనకాండకు గురై, తరువాత అనారోగ్యంతో కన్నుమూసిన స్నేహలతకు అంకితం ఇచ్చాడు కవి. పఠాభి ‘‘కయిత నా దయిత’’ అనడానికి ముందర, పిల్లలమర్రి పిన వీరభద్రుడు, ‘‘వాణి నా రాణి’’ అని ఆత్మవిశ్వాసంతో ప్రకటించాడు. ఈమెతో పెళ్లి తరువాత, తండ్రికి అంగీకరం లేకపోవడంతో వేరు పడ్డ పఠాభి, ఆశయ సంపన్నమైన తన భార్యతో కలిసి చెన్నపట్నంలో అప్పటి ఆంగ్ల నాటక సంస్థ ‘‘మద్రాస్ ప్లేయర్స్’’ స్థాపించాడు. సినిమా, నాటకం, సాంఘిక కార్యాచరణ వీటిలో చురుగ్గా ఉండేవారు ఇద్దరూ. అప్పట్లో మదరాసు చలన చిత్రరంగంలో పెద్ద పేరుగా ఎదగబోతున్న కె.వి.రెడ్డితో కలిసి, ‘‘పెళ్లినాటి ప్రమాణాలు’’, ‘‘శ్రీకృష్ణార్జున యుద్ధం’’ సినిమాలకు సహ నిర్మాత కూడా. ఈ రెండూ విజయవంతమైన సినిమాలే. ఈ అనుభవంతో కన్నడ సినిమా రంగంలో ఎనిమిది సినిమాల నిర్మాతగా, పఠాభి సుప్రసిద్ధుడు. కొన్ని ప్రయోగశీలమైన మాటలు పఠాభి కవిత్వంలో, కొత్తదనానికి, పాశ్చాత్య దేశాల కవుల పోలికలతో సమానంగా, వినూత్నంగా నిలుస్తాయి. ‘‘మహానగరము మీద మబ్బు గమ్మి గర్జిస్తున్నది. దేవుని ఏరోప్లేనుల్ భువికి దిగుచుననటుల’’ ‘‘క్రాస్వర్డు పజిల్ లాగున్న నీ కన్నులను సాల్వుజేసే మహాభాగ్యం ఏ మానవునిదో గదా’’
ఇంకా పుస్తకం గురించిన విడ్డూరాలు మరికొన్ని -
మా పంతుల జోగారావు ఆశ్చర్యానందాల సందిగ్ధతతో సహా ఇలా చెప్పాడు - ‘‘హమ్మయ్య! దొరికిందండీ, ఇన్నాళ్లకి! పఠాభి ‘్ఫడేలు రాగాల డజన్’ పుస్తకం ఓ మిత్రుని ఇంట దొరికింది. మద్రాసు రామరాయ ముద్రణాలయం వారు వేసిన ఈ పుస్తకం ఏ సంవత్సరంలో ప్రచురించబడిందో వివరాలు ప్రచురణకర్తలు ఇవ్వలేదు. శ్రీశ్రీ ధర్మమా అనీ, ఇది ప్రమాది అధిక శ్రావణ మాసంలోనో, కాస్త అటూ ఇటూగానో వెలువడినట్టుగా భావించవచ్చు. దానికి సరిపోయిన ఇంగ్లీషు సంవత్సరం చూసుకుంటే సరి. వెల మాత్రం ‘‘డజన్ అర్ధణాలు’’ అని ఉంది. అంటే ఆరు అణాలని తాత్పర్యం! అనగా పావలా బేడ. అనగా అర్ధ రూపాయికి రెండణాలు తక్కువ. అనగా, నలుబది ఎనిమిది కాసులు. అనగా... అనగా... అనగా... పాత ఎక్కాల బుక్కు మీరే చూసుకోండి. కవి ఈ పుస్తకాన్ని వచన పద్యములు అని పేర్కొన్నాడు. నేను తెలుగులో పీజీ చేసినప్పుడు ఫిడేలు రాగాల డజన్ కోసం చాలా వెతికాను, ఎక్కడా కాపీలు నాకయితే దొరకలేదు.
ఇందులోనే కవితలను (వచన పద్యములను?) అక్కడా ఇక్కడా చూసి, ఎత్తి రాసుకొని బండి లాగించీసేను.
‘‘ఇప్పుడు దొరికింది, ఈ చిన్న పుస్తకం. ఎలా ఉందో చూసారూ? పఠాభి రచన మీద చెదలు తమ అభిప్రాయం చెప్పాలని అనుకుని, మధ్యలోనే విరమించుకున్నట్టున్నాయి. మహాభారతంతోపాటూ, మహాప్రస్థానం వరకూ అవి ఇలాగే తమ అభిప్రాయాలు నిక్కచ్చిగా తెలియచేస్తూ ఉంటాయి. మన జాగ్రత్తలో మనం ఉండకపోతే! పుస్తకం అట్టమీద - ‘‘చదవండి ఫిడేలు రాగాల్ డజన్’’ అని ఉంది. కింద చిన్న ఫిడేలు బొమ్మ చూసారు కదూ. ఇక్కడ కొంత కొంటెదనం. అప్పట్లో కొత్తదనం- కనబరిచారు. ఫిడేలు బొమ్మ కింద రాగాల డజన్ అని ముద్రించారు. కింద చలంగారి మాటలు... వెనుక అట్టమీద విద్వాన్ విశ్వం గారివీ, వేదుల (సత్యనారాయణ శర్మ) వారివీ, మాటలు ఉన్నాయి. తర్వాత, ఆంధ్రపత్రిక వారివీ, కథాంజలి వారివీ అభిప్రాయాలు కూడా వేశారు. పుస్తకములు దొరుకు స్థలము: నమ్మాళ్వారు, పోస్టు బాక్సు 251, మద్రాసు అని ఉంది’’.
ఈ ముప్పై ఎనిమిది పేజీల కవిత్వం మరి అంకితం ఎవరికి? ఊర్వశికా, ప్రేయసిని, అప్రాప్త మనోహరికా? వెక్కిరింత ప్రాణవాయువైన పఠాభి కుఠారమా మరొకటా - అటు టాగోర్‌కీ, ఇటు భావ కవులకి ఒకేసారి సొడ్డు - ఎవరు కావాలో తేల్చుకోలేని భావ కవుల డోలాయమాన స్థితి ఇక్కడ సూచితం - కొంత పఠాభి మార్కు వెటకారంతో. ‘‘అంకితము మృణాళినికి, కాదు కళ్యానికి; కాదు ఇరువురికి’’ అని ఉంది. మృణాళిని, టాగోర్ సాహిత్య పాత్ర, ఆయన భార్య పేరు కూడా. అలాగే అరవిందుల వారి శ్రీమతి కూడా మృణాళినే. అంకితం తరువాతి పేజీలో (ఒక డిస్‌క్లెమర్ అందామా నేటి మాటల్లో) ఇలా ఉంది: ‘‘అక్కడక్కడ ఈ పద్యాలలో వచ్చునట్టి పఠాభి అనే పేరుగల పాత్రకు, గ్రంథకర్తకు ఏ మాత్రం సంబంధం లేదని గమనింపు; ‘‘కృష్ణపక్షం’’లోని ‘‘కృష్ణ’’కును, దాని గ్రంథకర్త నామంలోని ‘‘కృష్ణ’’కును ఎలా సంబంధం లేదో అలాగే ‘‘ఇక, ‘‘ఇంట్రో’’ శ్రీశ్రీ రాసేరు. శ్రీశ్రీ నవ కవుల తిరుగుబాటుని గురించి రాస్తూ ‘్ఫడేలు రాగాల డజన్’ చదవమని సలహా ఇచ్చాడు. పేజీలు ముప్పై ఎనిమిది, పేజీ అంకెలన్నీ తెలుగులోనే. 1939లోనే తెలుగులో వచ్చిన ఈ రచన, తరువాతే నయాగరా కవుల నయాగరా కవిత్వ సంపుటి, తరువాతే ఆరుద్ర (త్వమేహం), సోమసుందర్ (వజ్రాయుధం), 1950లో శ్రీశ్రీ మహాప్రస్థానం - ఇలా ఈ నెల్లూరి కుర్రవాడు వచన కవితకు ఆద్యుడు కూడా! పఠాభి పన్ రాయడంలో సిద్ధహస్తులు. నిజానికి ఆ పన్ (ఒక మాటకు ఒక అర్థం ఉండగా, మరొక కొంటె అర్థం తీయం- ఆలోచిస్తే, అదీ సరైనదే అని అందరికీ అనిపించేలా ఆ పన్ ఉండడం). ఇది వక్రోక్తి పేరిట, భారతీయ సాహిత్యంలో ప్రాచీన పద్ధతే, అయితే ఆంగ్ల ప్రభావం గల ఆధునిక సమాజంలో ఆ మాటలు, మన మాటలు కూడా, ఈ వికట కవిత్వ ప్రతిభకు ఉపయోగిస్తాయి, ఇది దాదాపు ఆధునిక కవులందరిలో ఉన్నా - వీటిని 1980లో ‘‘పన్‌చాంగం’’ పేరిట తెచ్చిన కవి, హాస్య నిరంకుశుడు పఠాభి మాత్రమే.
ఇది ఆంగ్ల లిమరిక్‌ల్లో కొంత, సజావుగా చెప్తే గురజాడ కన్యాశుల్కంలో తెలిపిన పూర్రిచర్డ్ - రాసి పెట్టిన పూర్‌మాన్స్ అల్మానాక్, ఇంకా బ్రహ్మంగారి కాలజ్ఞానం, వగైరా ఒక సంప్రదాయం నుంచి వచ్చిన వైయక్తిక ప్రతిభగా ఈ పఠాభి పన్‌చాంగాన్ని సాహిత్య లోకం గుర్తించవలసి ఉంటుంది. కొన్ని ఈ పన్‌చాంగ పంచనాన వాక్ప్రసూనాలు ఇలా జోరుగా వెళ్తాయి - తప్పక శ్రవణానందము, స్మరణానందము, స్ఫురణానందము కలిగిస్తాయి.

- రామతీర్థ, 9849200385