Others

ఫ్రిజ్ వాడండిలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంవత్సరం పొడవునా రిఫ్రిజిరేటర్ వాడకంలో ఉన్నా ఇక ఎండలు మొదలవుతుండడంతో దాని అవసరం పెరుగుతుంది. అవసరానికి మించి ఒక్క క్షణం కూడా ఫ్రిజ్ తలుపు తెరచి ఉంచకూడదు. దీనివల్ల బయటి వేడిగాలి లోపలికి చేరి మళ్ళీ చల్లదనం సంతరించుకోవడానికి ఎక్కువ శక్తిసామర్థ్యాలు ఖర్చవుతాయి, మరికొంత సమయమూ పడుతుంది. నిల్వ చేయాల్సిన ఏ వస్తువునైనా ఫ్రిజ్ లోపల వెనకాల గోడకు తగలకుండా చూసుకోవాలి. లేదంటే శీతలీకరణకి ఎక్కువ సమయం పట్టడంతోపాటూ ఆ వస్తువులు పాడయ్యే ప్రమాదం ఉంది. గది ఉష్ణోగ్రతను మించి పదార్థాలు ఫ్రిజ్ లోపల పెట్టకూడదు. ఆ పదార్థాలు ఫ్రిజ్ లోపల వాతావరణాన్ని చెదరగొట్టి మన ఆరోగ్యానికి హాని కలిగించే బ్యాక్టీరియాని వృద్ధిచేస్తాయి.రిఫ్రిజిరేటర్ వెలుపల వెనకాల భాగాన ఉన్న కాయిల్స్ దాని పనిలో భాగంగా అధిక వేడిని గ్రహిస్తూంటాయి. అందుకని చక్కని గాలి ప్రసరణ ఉన్న ప్రదేశంలో ఫ్రిజ్‌ను అమర్చుకోవాలి. సూర్యరశ్మి పడకుండా, గ్యాస్ స్టౌవ్ మరియేతర వేడిని కలిగించే వాటిని దూరంగా ఫ్రిజ్ ఉండేట్లు జాగ్రత్తపడాలి. ఈ కాయిల్స్‌పై దుమ్ముధూళి చేరకుండా, ఫ్రీజరులో మంచుగడ్డలు కట్టకుండా తరచూ చూసుకోవాలి. అన్నివేళలా ఫ్రీజరు ముందస్తు విలువలు మరీ ఎక్కువ కాకుండా సరిపడా చేసుకోవాలి. దీనివల్ల రిఫ్రిజిరేటర్ పనితనం మెరుగవడం తద్వారా దాని జీవితకాలం పెరగడంతోపాటూ విద్యుత్తు వినియోగాన్ని తగ్గించవచ్చు.

- మురళీకృష్ణ