ఆంధ్రప్రదేశ్‌

ఈ బుకింగ్ ద్వారా కౌలు రైతుల గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి పుల్లారావు వెల్లడి

హైదరాబాద్, మార్చి 14: రాష్ట్రంలో కౌలు రైతుల గుర్తింపులో ఇబ్బందులు ఉన్నాయని, భూ యజమానులతో కౌలు రైతులు లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకోవడం వలన కౌలు రైతులను గుర్తించడం సమస్యాత్మంగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కౌలు రైతుల గుర్తింపునకు ఈ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చామని అన్నారు. ఖరీఫ్ సీజన్‌లో చాలా మంది కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వని మాట వాస్తవమేనా అని సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు ఎ సురేష్, పోతుల రామారావు, జి రవికుమార్ ప్రశ్నించారు. సురేష్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో 20 శాతం కన్నా తక్కువ రుణాల మంజూరు చేశారని అన్నారు. కర్నూలు జిల్లాలో 22,461 మంది కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, 10 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేశారని అన్నారు.
కర్నూలు జిల్లాలో కౌలు రైతులు రుణ భారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చరితారెడ్డి అన్నారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కౌలు రైతులను గురించేందుకు నిర్దిష్టమైన ఆలోచన లేకపోవడం దురదృష్టకరమన్నారు. కొన్ని చోట్ల సొసైటీ భూములను కౌలు చేసుకుంటున్నారని, వీరిని గురించడం లేదని ఆయన అన్నారు. వీటికి మంత్రి పుల్లారావు సమాధానం చెపుతూ భూ యజమాని రాతపూర్వకంగా, లేక మూజువాణి ద్వారా కౌలు రైతుతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని అన్నారు. భూ యజమాని కూడా రుణాలు కోరుతున్నారని, అటు యజమానికి, ఇటు కౌలు రైతుకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకు యాజమాన్యాలు ఇబ్బందిపడుతున్నాయన్నారు. మరింతమంది కౌలు రైతులను గుర్తించేందుకు ఈ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చామని అన్నారు.దీనిపై జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 16,25,000 మంది కౌలు రైతులు ఉన్నారని, వీరిలో 95,299 మందికి 218 కోట్ల రూపాయలమేర మాత్రమే రుణ మాఫీ చేయడ శోచనీయమని అన్నారు.
షాదీఖానాలకు రూ.50 కోట్లు
రాష్ట్రంలో షాదీఖానాల నిర్మాణానికి 50 కోట్ల రూపాయలు కేటాయించినట్టు మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్థర్‌రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో అల్ప సంఖ్యాక వర్గాల వారికి షాదీఖానాలు నిర్మించే ప్రతిపాదన ఉందా? అని ప్రశ్నించారు. దర్గాల్లో కూడా షాదీ మంజిల్‌లు నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే దర్గాల్లో పనిచేస్తున్న వారికి గౌరవ వేతనాన్ని మంజూరు చేయాలని, వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలని ఆయన కోరారు. దీనికి మంత్రి పల్లె సమాధానం చెపుతూ రాష్ట్రంలో 244 షాదీఖానాలు నిర్మాణంలో ఉన్నాయని వీటిలో 108 ఇప్పటి వరకూ పూర్తయ్యాయన్నారు.
ధర్మవరంలో పేదలకు ఇళ్ళ స్థలాలు కేటాయించేందుకు భూసేకరణ జరుపుతున్నారా? అని ఎమ్మెల్యే గొనుగ్గుంట్ల సూర్యనారాయణ అడిగిన ప్రశ్నకు రెవెన్యూ మంత్రి తరపున రావెల కిషోర్‌బాబు సమాధానం చెపుతూ భూసేకరణ జరిగిందని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద నిధులు కూడా కేటాయించామని చెప్పారు.