మెయన్ ఫీచర్

విశ్వజనీనమైనది యోగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరు వేల పైచిలుకు సంవత్సరాల చరిత్ర కలిగిన యోగకు నేడు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. జూన్ 21 అంతర్జాతీయ యోగ దినంగా ఐరాస ప్రకటించింది. ‘యోగఃకర్మశుకౌశలం’ అన్నారు. చేస్తున్న పనిలో ప్రావీణ్యతను సంపాదించడమే యోగం. మనిషి నిముషానికి నాల్గు ఆలోచనలు చేస్తాడని మనస్తత్వ శాస్తవ్రేత్తలంటారు. 12 గంటల జాగృతావస్థలో మనిషి రోజూ వందల ఆలోచనలు, ఏడాదిలో ఎన్నో వేల ఆలోచనలు చేస్తాడు. మనిషి దృష్టిలోని అన్ని వేల ఆలోచనలనుంచి ఒకే విషయం వైపు మళ్ళించే ప్రయత్నమే యోగ. ఒకే శ్వాస, ఒకే ధ్యాస, దానివల్ల కొత్త శక్తి సమకూరుతుంది. రోజంతా పనిచేసుకుపోయేందుకు కావలసిన ఉత్సా హం లభిస్తుంది. శరీరమంతా వొకటైపోయి వర్తించే ప్రక్రియ అది. కేవలం వ్యాయామం కాదు. శివుడే గురుపూర్ణిమ రోజున యోగ ప్రారంభించాడని శ్రీ జగ్గీవాసుదేవ్ అం టారు. భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ చేసిన ప్రతిపాదనకు అమెరికా, కెనడా, చైనా సహా 177 దేశాలు మద్దతు పలికాయి. భారత్‌లో ‘యోగ’కు శ్రీ బాబారామ్‌దేవ్ కొత్త జవసత్త్వాలిచ్చారు. పతంజలి యోగ పాఠంలో యోగ నిపుణులు దేశమంతా యోగా శిబిరాల నిర్వహణ ద్వారా మంచి ప్రాచుర్యంలోకి తెచ్చారు. జనవరి 2011, 2013ల్లో అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించి, ప్రపంచవ్యాప్తంగా, శాస్తవ్రేత్తలు, యోగ నిపుణులను పిలిచి యోగ విశేషాల్ని ప్రపంచానికి చాటారు. పరిశోధనలకై శాస్తవ్రేత్తల్ని ప్రోత్సహించారు. హార్వాడ్ మెడికల్ స్కూల్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, టెక్సాస్‌ల నుంచి కూడా శాస్తవ్రేత్తలు పాల్గొన్నారు. పతంజలి యోగపీఠంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ బోధకులు శ్రీశ్రీ రవిశంకర్ కూడా సుమారు 100కు పైగా దేశాల్లో యోగను ప్రచారం చేశారు. అనాది అయిన ‘యోగ’కు మోదీ అంతర్జాతీయ ఖ్యాతి కల్గించారని రవిశంకర్ ప్రశంసించారు.
భారత్ గర్వంగా తలెత్తుకుని తిరిగే ‘యోగం’ ‘యోగ’వల్ల లభించింది. ఢిల్లీలో ఇండియా గేట్ మొదలుకొని జిల్లా, గ్రామస్థాయిలో మున్సిపల్ పార్కు, ప్రభుత్వ ఆట స్థలాల్లో యావత్ భారతమంతా నేడు ‘యోగా’ చేస్తూ కనిపిస్తారు. ఆరోగ్యం గురించిన స్పృహ పెరిగినకొద్దీ ‘యోగ’ను కూడా ఆసుపత్రులు, ఆఫీసుల్లో అభ్యసించడం మొదలయింది. ప్రపంచంలో అనేక దేశాలు జూన్ 21 కోసం తయారీ ప్రారంభించాయి. ఢిల్లీ ఇండియాగేట్ వద్ద సుమారు 45000 మంది 35 నిముషా లపాటు పాల్గొనే సామూహిక యోగ కార్యక్రమంకోసం రంగం సిద్ధమవుతోంది. సాంస్కృతిక జాతీయవాదపు పరిమళాలు ప్రగాఢంగా ప్రకటింపబడుతున్న వేళ, ప్రజాస్వామ్య లౌకిక స్ఫూర్తి పేరున పనికిమాలిన ప్రేలాపనలు కూడా జోరందుకున్నాయి.
ఎమ్‌ఐఎమ్, ఎమ్.పి ఒవైసి ఇది హిందూ మతం రంగు అందరిపై రుద్దడమన్నాడు. ముస్లిం పర్సనల్ లాబోర్డు నాయకుడు ఖలీద్ రషీద్ ఫారంగి యోగ, సూర్యనమస్కారాల విషయమై ప్రశ్నించారు. అమెరికాలో కాలిఫోర్నియాలోని శాండిగో జిల్లాలో ఓ క్రైస్తవ జంట స్కూళ్లల్లో యోగవల్ల హిందూ మతానికి ప్రచారం లభిస్తోందని, క్రైస్తవం మరుగున పడ్తున్నదని చేసిన వాదనను కోర్టు త్రిప్పికొట్టింది. యోగకు మతంతో, మాయలతో, ఛాందసాలతో సంబంధం లేదంది.
ప్రముఖ నవలా రచయిత అమిష్‌త్రిపాఠి తన నవలల్లో పాత్రలు యోగభ్యాసం చేస్తాయన్నాడు. సూర్యుడికి నమస్కరించడం తమ మతానికి వ్యతిరేకం అంటున్న ఛాందసులు సూర్యుడి ద్వారా పండే పంటలఫలాలనెలా అనుభవిస్తున్నారు? సూర్యశక్తి నుంచి వచ్చే విద్యుత్ కాంతుల్లో ఎలా జీవించగల్గుతున్నారు? రాబోయే రోజుల్లో సౌరశక్తియే సకల శక్తికానున్నది. సూర్యుణ్ణి ఒక ప్రకృతి శక్తిగా భావించవచ్చు. కృతజ్ఞతతో వ్యవహరించవచ్చు. దేవుణ్ణి నమ్మని నాస్తికులుండవచ్చు. కాని సూర్యుణ్ణి నమ్మని వారుండరు. కులం, మతం, ప్రాంతం, దేశం, భాషాభేదాల్లేకుండా అందరికీ ఆయన వెలుగుల్ని పంచుతాడు. ప్రజల కలిమిని పెంచుతాడు. సూర్య నమస్కారాల్లో అనేక ఆసనాలున్నాయి. ఇవి శరీరానికి చైతన్యాన్నిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం ఆరోగ్యం అంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం. సూర్య నమస్కారాల్లో ఈ మూడూ ఉన్నాయి. ఊబకాయం, అధిక రక్తపోటు, కీళ్ళ నొప్పు లు, ఆధునిక జీవితంలో ప్రతి ఆరోగ్య సమస్యకు సూర్య నమస్కారాల్లో పరిష్కారం వుంది. సూర్యుడి నుంచి వచ్చే డి విటమిన్ ఎముకల్ని గట్టి పరుస్తుంది. శ్వాస సంబంధ వ్యాధులు, ‘ఇ’ విటమిన్‌వల్ల నేత్ర సంబంధ వ్యాధులు దూరమవుతాయి. శరీరంలో 97 శాతం కండరాలలో కదలిక వస్తుంది. కర్ణాటకలోని గుల్బార్గా, కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో వీటిపై పరిశోధనలు జరిగాయి. సాధకుల ఆరోగ్య పరిస్థితిలో చాలా మార్పువచ్చినట్లు నిపుణులు గుర్తించారు. అమెరికాలోని శ్యాన్‌సోన్ స్టేట్ యూనివర్సిటీలో కూడా అధ్యయనం జరిగింది. ఉజ్‌బెకిస్తాన్ రాష్ట్రంలోని తాష్కెంట్ నగరంలో కూడా పరిశోధనలు జరిగాయి. జీవ ప్రక్రియలతోపాటు గుండె పనితీరు కూడా మెరుగుపడిందని ఈ వర్గాలు ప్రకటించాయి. జపాన్ తదితర అనేక దేశాల యోగ కేంద్రాల్లో సూర్యనమస్కారాల్ని నేర్పుతు న్నారు. సిక్స్ ప్యాక్ మోజులో ఉన్న కుర్రకారుకు సిక్స్త్‌సెన్స్ యిచ్చేది సూర్యనమస్కారాలు. పైసా ఖర్చులేని పని. ప్రతిది మతం, రాజకీయం రంగు అద్దాలలో చూడడం మన నాయకులకు అలవాటే. ముస్లింలు నమాజు చేసేందుకు వజ్రాసనం వస్తారు. వజ్రాసనంవల్ల వజ్ర సంకల్పం, ఏకాగ్రత సిద్ధిస్తుందని శ్రీ పట్ట్భారావు వారి వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో రాశారు. సూర్యునమస్కారాలతోపాటు ‘యోగ’లో యింకా చాలా వున్నాయి. కాంగ్రెసు పార్టీ కూడా యోగను వ్యతిరేకిస్తున్న వారికి వంత పాడడం మొదలెట్టింది. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా అమెరికాలోని 100 నగరాలలో ‘యోగధాన్’ నిర్వహించనున్నారు. పాకిస్తాన్ మాత్రం భారతీయ యోగ శిక్షకులకు ‘వీసా’ నిరాకరిస్తోంది. పాకిస్తాన్‌లో నివసిస్తున్న భారత దౌత్యవేత్తలకు ధనురాసనం, మార్జారియాసనం, మత్స్యాసనం, సేతుబంధాసనం వంటివి వొత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వ్రాసింది. సింగపూర్‌లో 50 చోట్ల భారత్ హైకమిషనర్ శ్రీ విజయ్‌ఠాకూర్‌సింగ్ ఆధ్వర్యంలో ‘యోగ’ నిర్వహిస్తారు. దుబాయ్, బెల్జి యం, రానోయ్‌లలో యోగా దినోత్సవం జరుగనుంది. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ జగ్గీవాసదేవ్ మతాతీతంగా, లాభాపేక్ష లేకుండా కోయంబత్తూర్ వద్ద యోగ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రపంచ నేతలు కలిసినపుడు ఆర్థిక ప్రగతి గురించి మాత్రమే మాట్లాడుకుంటారని ‘ఆరోగ్యం గురించి మాట్లాడింది మోదీ మాత్రమేనని’ అన్నారు. మంత్రాలలో, ఉచ్ఛారణలో ధ్వని శాస్త్రం వుందని, ఆ ధ్వనివల్ల వాతావరణం పరిశుద్ధమవుతుందని, ‘ఓంకార ధ్వనిపై’ అనేక విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతాయని అన్నారు.
ఢిల్లీ జుమా మసీదు యిమాం యోగ దినోత్సవంపై కొందరు చేస్తున్న రగడకు తెరదించారు. ఖురాన్‌లో ‘యోగ’ ఇస్లాంకు వ్యతిరేకమని చెప్పలేదని అన్నారు. వేదాలలో సూర్య స్తుతి వుంది. చైనా, ఈజిప్టు, మెసపుటోమియా యితిహాసాలలో కూడా సూర్యుడి ప్రస్తావన వుంది. యూరపులో రథం మీద వెళ్ళే సూర్యుడని, జర్మనులో సోల్ అనీ, గ్రీకు దేశంలో హీలియో లేదా టైటన్ అనీ, రోమన్లు జయంచలేని సూర్యుడనీ, ఆఫ్రికాలో వివిధ జీవ జాతి తెగలు వివిధ రూపాలలో సూర్యుడిని ఆరాధిస్తారు. బౌద్ధంలో సూర్యప్రభగా, ఇండోనేసియాలో ‘పిత లేదా స్థాపకుడుగా సూర్యు డ్ని గురించి వుంది. జపాన్ దేశంలో సూర్యదేవతను ‘అమరదేరాస’ అన్నారు. సూర్యు డు లేక విశ్వం లేదు. సూర్య నమస్కారం లేని ఆసనం లేదు. ఆసనం లేని ఆరోగ్య సూత్రం లేదు. ఐదేళ్ళ క్రితం ఆస్టెన్, టెక్సాస్‌లలో వాఠ, కుండలిని మరియు అష్టాంగ యోగాలకు సంబంధించిన 75 నిముషాల నిడివిగల తరగతులు నిర్వహించబడ్డాయి. దీన్ని బిగినర్ యోగా ప్రోగ్రామ్ (బివైపి) అన్నారు. నాల్గు వారాలు నిర్వహించిన ఈ తరగతుల్లో శిక్షణ పొందిన వారిపై ఓ సర్వేక్షణ జరిగింది. ‘యోగ’ను ఎందుకు కోరుకుంటున్నారు అన్న ప్రశ్నకు స్పందన ఈ క్రింది విధంగా వుంది. దీన్నుంచి ‘యోగ’ ‘మతం’ సంబంధిం లేని విషయాలని అర్థమవుతుంది.

కారణం కోరుకుంటున్న కారణం కోరుకుంటున్న
వారి శాతం వారి శాతం

సామాన్య ఆరోగ్యం 81% స్వీయ నిర్ణయం 25%
వ్యాయామం 30% రోగ నివారణ 23%
ఒత్తిడి నిర్వహణ 73% ఇతరం 20%
ఆధ్యాత్మిక అనుర్గతి 37% పాచీకోసం 18%
ఆరోగ్యం బాగు 28% సామాజిక సంబంధాలు 16%
డాక్టరు సలహా 5%