ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు
**
డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1) ఏ చిత్రంలోనిది ఈ వర్కింగ్ స్టిల్?
2) కౌగిలింత వేడిలో కరిగె వనె్న వెనె్నల/ మాయజేసి దాయకు సోయగాల మల్లెలు.. ఈ చరణాల పల్లవి ఏది?
3) ‘శ్రీదేవి’లో బాల నటి/ ‘్భక్తప్రహ్లాద’లో ప్రహ్లాదుడు- ఎవరు?
4) రేలంగికి కుమార్తెగా గిరిజ ఏ చిత్రంలో కనిపించింది?
5) ఊపిరిలో నందిని/ మహానందిలో నందిని- ఎవరు?
6) అనుబంధం/ కంచుకాగడ- దర్శకుడు?
7) అమ్మ చెప్పింది/ అందరి బంధువయ- హీరో?
8) 143/ ధన 51- సంగీత దర్శకుడు?
9) రామ్ హీరో/ అక్కినేని, కృష్ణ విడివిడిగా నటించిన సినిమా పేరు?
10) జయలలిత, ఏఎన్నార్ కనిపిస్తున్న స్టిల్ ఏ చిత్రంలోది?

సమాధానాలు- 8

1) గుడుంబా శంకర్ 2) హేమమాలిని
3) శ్రీరాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్
4) తేజస్విని 5) జగమేమాయ 6) హరనాథ్ 7) సుమంత్ అశ్విన్ 8) సునీల్ కశ్యప్
9) యస్ జానకి 10) కమల్‌హాసన్.

సరైన సమాధానాలు రాసిన వారు

ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
పి విజయలక్ష్మి, రాజమండ్రి
కోట దేవి, కొత్తవలస
వి గరుత్మంతుడు, కొణిజేడు
ఎన్ ఊర్మిళాదేవి, పార్వతిపురం
కె రాజారావు, రాజమండ్రి
ఎల్ అర్జునరావు, చెన్నై
ఆర్ వరాలు, సున్నిపెంట
వి వరప్రసాద్, మోర్తాడు
వి వెంకటయ్య, వింజాపూర్
ఎన్ విమలారాణి, రాజమండ్రి
ఎన్ గిరీశం, మోపిదేవి
పి రవి, సంతనూతలపాడు
కె దుర్గాప్రసాద్, కందుకూరు
ఎస్ అనురాగ్, అమలాపురం