ఆంధ్రప్రదేశ్‌

బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో రూ.3 కోట్ల ప్రజల సొమ్ము స్వాహా

నెల్లూరు, మార్చి14: ప్రజల అమాయకత్వాన్ని తమ ఆసరాగాతీసుకుని నిరుపేదల సొమ్మును దోచుకున్న మరో ఫైనాన్స్ సంస్థ వ్యవహారం నెల్లూరులో వెలుగుచూసింది. కట్టిన సొమ్ము కోసం కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోవటంతో చివరకు బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. నెల్లూరుకు చెందిన తుమ్మపూడి కామేశ్వరరావు 2011లో నెల్లూరులో పద్మావతీ గ్రీన్‌ఫీల్డ్(అభీష్టా గోల్డ్) అనే నగదు వసూలు తరహా ఫైనాన్స్ సంస్థ నెలకొల్పాడు. అప్పట్నుంచి 2013 వరకూ ఇదే పేరుతో సంస్థను కొనసాగించి తర్వాత అభీష్టా ఆగ్రోటెక్ గా పేరు మార్చి ఆరునెలల వరకూ తనే సంస్థ యజమాని హోదాలో కార్యకలాపాలు సాగించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డిగూడెం, ఏలూరు, శ్రీకాకుళం, రాజాం, చీపురుపల్లి, హరిపురం, నంద్యాల, గడివేముల, కనిగిరిలతో పాటు తెలంగాణా రాష్ట్రంలోని సత్తుపల్లి, మధిర ప్రాంతాల్లో బ్రాంచిలు ఏర్పాటు చేశారు. పేరు మార్చిన తర్వాత నెల్లూరుకే చెందిన కాపులూరి రమేష్‌బాబురెడ్డి అనే వ్యిక్తిని తన సంస్థలో భాగస్వామిగా చేసుకొని అతనికే ఎండీగా బాధ్యతలు అప్పచెప్పాడు. అప్పటివరకూ కంపెనీ సేకరించిన సుమారు రూ.2.40 కోట్లను ఆయనకు అప్పగించాడు. తామిద్దరం ఇకపై సంస్థ కార్యకలాపాలు సంయుక్తంగా కొనసాగిస్తామని ఏజెంట్లతో, సిబ్బందితోనూ ప్రత్యేక సమావేశం నిర్వహించి చెప్పారు. ఏజెంట్ల సమస్యలు, సిబ్బంది జీతభత్యాలు, డిపాజిట్‌దారులకు మెచ్యూరిటీ సొమ్ము తదితర విషయాలన్ని ఇకపై రమేష్‌బాబురెడ్డి చూసుకుంటారని పేర్కొన్నారు. కొంతకాలానికి కామేశ్వరరావు కూడా సంస్థ నుంచి తొలగడంతో ఆయన స్థానంలో రమేష్‌బాబురెడ్డి భార్య పద్మావతమ్మ, కుమార్తె పూజారెడ్డిలను సంస్థలో కీలక పదవులకు తీసుకున్నారు. ఈ వ్యవహారం జరిగిన నెల రోజుల తర్వాత కామేశ్వరావు కనిపించకుండా పోయారని ఏజెంట్లు చెప్తున్నారు. ఆయన లేకున్నా సంస్థ బాధ్యతలన్నీ ఇక తనవే నంటూ ఏజెంట్లకు రమేష్ భరోసా ఇచ్చారు. అక్కడ్నుంచి సంస్థ కార్యకలాపాలన్నీ ఆయన కుటుంబసభ్యుల ద్వారానే జరుగుతుండేవి. మెచ్యూరిటీ సొమ్మును డిపాజిట్‌దారులకు సకాలంలో ఇస్తూ కొంతకాలం పాటు సంస్థను సరిగానే నడిపారు. తర్వాత క్రమంగా మెచ్యూరిటీ సొమ్మును గడువు సమయానికి ఇవ్వకుండా ఖాతాదారులను ఇబ్బందులకు గురిచేయటం ప్రారంభమైంది. ఈ విషయమై ఏజెంట్లు నిలదీయటంతో వారికి రూ.80లక్షల మేర చెక్కులు ఇచ్చి సరిపుచ్చారు. అకౌంట్‌లలో నగదు లేకపోవటంతో చెక్కులు బౌన్సయ్యాయి. కేవలం అగ్రిమెంట్‌తోనే నిలిపివేయటంతో పరిస్థితి యధాస్థితికి చేరుకొంది. అప్పట్నుంచి సంస్థ మోసం చేస్తోందనే విషయం వెలుగులోకి రావటంతో డిపాజిట్‌ల సేకరణ తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో తమ సొమ్ముల కోసం కంపెనీ యాజమాన్యంపై డిపాజిట్‌దారులు ఏజెంట్ల ద్వారా ఒత్తిడి తీసుకురావటం ఎక్కువవడతంతో సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయినట్లు ఏజెంట్లు తెలిపారు. ప్రజలు సొమ్ములను డిపాజిట్ చేస్తే సంస్థ ఇలా మోసం చేసిందనీ, తాము తమ ప్రాంతాల్లో ముఖం చూపించలేక నెల్లూరులోనే మకాం వేసి సదరు వ్యక్తి నుంచి నగదు వసూలుకు ప్రయత్నిస్తున్నామని ఏజెంట్లు వాపోయారు. చివరకు గత్యంతరం లేని పరిస్థితిలో వారంతా నెల్లూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్నికి తమ సమస్యను వినతిపత్రం లో సోమవారం తెలిపారు.