ఐదుగురు హీరోలతో రుద్రాక్ష?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్నమైన కథాంశాలతో చిత్రాలు రూపొందించి క్రియేటివ్ దర్శకుడిగా తెలుగు పరిశ్రమలో తనదైన స్థానాన్ని స్వంతం చేసుకున్న కృష్ణవంశీ తాజాగా మరో చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. గత ఏడాది ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా తరువాత ఆయన చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇప్పటికే చర్చలు జరుపుకుంటున్న ఈ చిత్రం థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా వుంటుందని తెలిసింది. ప్రముఖ హీరోయిన్ ప్రధాన పాత్రలో నటించనుందట. ఇందులో ఐదుగురు యువ హీరోలు నటిస్తారని సమాచారం. వారెవరనేది త్వరలో కన్‌ఫర్మ్ కావాల్సి వుంది. ఈ చిత్రాన్ని నటుడు ప్రకాష్‌రాజ్ నిర్మిస్తాడట. ఈ చిత్రానికి ‘రుద్రాక్ష’ అనే టైటిల్‌ని అనుకుంటున్నట్టు తెలిసింది. కృష్ణవంశీ శైలిలో తెరకెక్కే ఈ సినిమాపై ఇపుడే అందరిలో ఆసక్తి నెలకొంది.