ఫోకస్

ఆర్థికంగా వెనుకబడినవారికే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాల ప్రయోజనంకోసం కాకుండా ఆర్థికంగా వెనుకబడినవారికే రిజర్వేషన్లు కల్పించాలి. ఒక కుటుంబం ఆర్థికంగా సంతృప్తి పొందితే ఆ కుటుంబానికి రిజర్వేషన్లపై కల్పించే రాయితీలను తొలగించే విధానంపై ప్రభుత్వం ఆలోచించాలి. కుల, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తే అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీలన్నీ వారి వారి పాలనలో రిజర్వేషన్లను స్వార్థ ప్రయోజనాలకు వాడుకునే అవకాశం ఉంటుంది. దీంతో రాజకీయ పార్టీలు రిజర్వేషన్లు అనే సాకుతో సమాజాన్ని విడదీసే వారవుతారు. మెరిట్ ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తే దేశంలో ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కావు. కుల ప్రాతిపదికన జరిగే రిజర్వేషన్లు స్వార్థ ప్రయోజనాలకే పరిమితమవుతాయి. ప్రస్తుతం రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉద్యమాలు, ఆందోళనలు స్వార్థపూరితమైనవే. రిజర్వేషన్లు రాజకీయాలకతీతంగా ఉండాలి. అలాంటి రిజర్వేషన్లు సమాజానికి, దేశానికి, మానవ మనుగడకే ప్రమాదం. దేశంలో రిజర్వేషన్లు కేవలం ఏ ఒక్క కులానికే ప్రమాణికం కాకూడదు. సర్వ మతాలు కలిగివున్న దేశంలో ప్రతి ఒక్కరి ఆర్థిక, స్థితిగతులపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో మైనార్టీలు రిజర్వేషన్లు లేక ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారు. మైనార్టీలకు తగిన ప్రాధాన్యత లేదనడం కాదు. తండ్రి చేసిన పనే కొడుకు చేస్తాడు. ఇలా చాలావరకు మైనార్టీల్లో ఉన్నారు. అదే ఇతర కులాల్లో చూస్తే ప్రతి కుటుంబంలో ఉద్యోగం ఉంటుంది. బిసి రిజర్వేషన్ ద్వారా కుటుంబంలో ఒకరు డాక్టర్‌గానో, ఇంజనీర్‌గానో, ఏదేని ఒక ఉద్యోగంలో స్థిరపడి ఉంటారు. అదే మైనార్టీల్లో ఉండరు. కాబట్టి వెనుకబడిన ఒక కుటుంబం ఆర్థికంగా ఎదిగేవరకు ఆ కుటుంబానికి, ఆ వర్గానికి రిజర్వేషన్ కల్పించాలి. ఆర్థికంగా ఎదిగిన తరువాత రిజర్వేషన్ (రాయితీ)ను తగ్గించే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి. రిజర్వేషన్లు అందరికీ ఆమోద్యయోగంగా ఉన్నప్పటికీ, ఆర్థికంగా వెనుకబడివున్న వారికే రిజర్వేషన్లు కల్పించాలి. అదేవిధంగా ఏళ్లతరబడి రిజర్వేషన్లు ఉండకూడదు. అదే పద్ధతిని కొనసాగిస్తే రిజర్వేషన్లు ఉన్నవారే అభివృద్ధి చెందుతారు తప్ప ఆర్థికంగా వెనుకబడిన వారు ఎదగలేరు. రాజకీయంగా పదవులకోసం ఉద్యమాలు చేయడం మంచిది కాదు. ఆర్థికంగా వెనుకబడివున్న వారికోసం రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం చేయండి. వారికోసం ఉద్యమాలు చేపట్టండి. రాజకీయాలకతీతంగా రిజర్వేషన్లపై పోరాడండి. ఎవరికి వారు రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ పోతే ఆర్థికంగా లేనివారు ఎక్కడికి పోవాలి? ఈ రోజు కాపులను బిసిలో చేర్చాలని ఓ ఉద్యమం, రేపు మరో కులంవాళ్లు ఉద్యమిస్తారు. అప్పుడు ఏమిటి పరిస్థితి? ఇలా ప్రతిసారీ ఒక్కో ఉద్యమం వస్తుంటే ఎంత మందికని, ఎందరికని రిజర్వేషన్లు ప్రకటిస్తూ పోతారు. ఏదిఏమైనప్పటికీ రిజర్వేషన్ల ప్రక్రియ అన్నది ఆర్థిక పరిస్థితిని ప్రాతిపదికగా తీసుకోవాలి. రిజర్వేషన్లు ఎల్లకాలం కూడా ఉండకూడదు.

- పాండురంగా రావు లోక్‌సత్తా పార్టీ తెలంగాణ నాయకుడు