ఫోకస్

మంచి చేసి ఆకర్షిస్తున్నాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ కొత్త రాష్ట్రం. రాష్ట్రం ఆవిర్భవించి టిఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. మిగిలిన రాష్ట్రాలు వేరు, కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రం వేరు. రాష్ట్భ్రావృద్ధికి అందరం కలిసి పనిచేద్దాం, సూచనలు, సలహాలు ఇవ్వండి అని కోరారు. ఆరునెలల్లోనే విద్యుత్ సమస్యను ముఖ్యమంత్రి పరిష్కరించి చూపించారు. ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధికోసం వినూత్న తరహాలో ఎన్నో ఆలోచనలు చేశారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పినవి చేసి చూపిస్తుండడంతో పాటు చెప్పనివి కూడా చేస్తున్నారు. కళ్యాణలక్ష్మి వంటి పథకం ఎన్నికల ప్రణాళికలో లేదు. దీని గురించి పార్టీలో చర్చ జరిగితే ఇప్పుడే వద్దు ఎన్నికలకు రెండు నెలల ముందు ప్రారంభిస్తే బాగుంటుందని అన్నవారు కూడా ఉన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పథకాలు అమలు చేస్తే ప్రజలు ఆదరించరు చేసేదేదో ఇప్పుడే చేద్దాం అని ముఖ్యమంత్రి ఈ పథకం అమలును ప్రకటించారు. మంత్రివర్గ సమావేశంలో 42 అంశాలపై నిర్ణయం తీసుకున్నారు, కళ్యాణలక్ష్మి ఆ నిర్ణయాల్లో ఒకటి. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి విపక్షాలకు చెందిన కొందరు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. అభివృద్ధిలో తామూ భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో వస్తున్నారు. వారు పార్టీ మారడం ధర్మ బద్ధమా? కాదా? అనేది వేరు. చట్టబద్ధంగానే చేరుతున్నారు. చట్టబద్ధంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందాలని, అభివృద్ధిలో తామూ భాగస్వాములుగా ఉండాలని, ప్రభుత్వం చేసే మంచి పనులకు తమ వంతు సహకారం అందించాలనే ధర్మబద్ధమైన ఆలోచనలతో ఇతర పార్టీల వారు టిఆర్‌ఎస్‌లోకి వస్తున్నారు. ప్రజాప్రతినిధులు పార్టీలు మారడం ఇదే మొదటి సారేమీ కాదు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండగా, ఇతర పార్టీల వారిని చేర్చుకున్నారు. గతంలో వైఎస్‌ఆర్ ఉన్నప్పుడు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. ఆంధ్రలో అధికారంలో ఉన్న టిడిపి ఇలానే చేర్చుకుంటోంది. నంద్యాల ఎంపి ఎస్‌పివై రెడ్డి కనీసం ఎంపిగా ప్రమాణస్వీకారం కూడా చేయక ముందే టిడిపిలో చేర్చుకున్నారు. వైఎస్‌ఆర్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చట్టబద్ధమా కాదా? అనేది స్పీకర్ తేలుస్తారు. అవసరం అయితే వారితో రాజీనామా చేయించి తిరిగి పోటీ చేయించాలనే ఆలోచన ఉంది.

- పల్లా రాజేశ్వర్‌రెడ్డి టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ