ఫోకస్

భావ స్వేచ్ఛ అంటే ఇదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భావ స్వేచ్ఛ దుర్వినియోగానికి పరాకాష్టగా జెఎన్‌యూ గొడవను పేర్కొనవచ్చు. రాజ్యాంగంలోని 19వ అధికరణ కింద మనకు లభించిన భావ స్వేచ్చను శత్రు దేశాలకు ఉపయోగపడే విధంగా వినియోగించుకునే విధంగా జెఎన్‌యు వివాదం తయారైంది. ఇటీవల కాలంలో హెచ్‌సియూ, జెఎన్‌యూ వివాదాలు చూస్తుంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా కొంతమంది విద్యార్థుల ఆలోచనలు, కొన్ని విద్యార్థి సంఘాల భావజాలం తయారైందా అనిపిస్తోంది. తప్పుచేస్తున్నామనే భావన, ఆలోచన వీరికి లేకపోవచ్చు. భారతదేశ పవిత్ర మందిరం పార్లమెంటుపై దాడి చేసిన కుట్రలో అఫ్జల్ భాగస్వామి. మన జవానులు పార్లమెంటును రక్షించేందుకు నేలకొరిగారు. కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ ప్రచ్చన్న యుద్ధాన్ని ఎదుర్కొంటూ అనేకమంది వీర జవానులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అసమానమైన త్యాగానికి నిదర్శనమైన భారత సైనికులను అవమానపరిచే సంఘటనలకు యూనివర్శిటీలు కేంద్రాలు కారాదు. మనకేమీ కావాలి? మన హక్కులు ఏమిటి అనే వాటిపై పోరాడాలి. అంతేకాని మన రాజ్యాంగ మందిరంపై దాడి చేసిన వారి సంస్మరణ సభకు హాజరు కావడం, మళ్లీ నినాదాలు చేయలేదనడం దారుణం. భావ స్వేచ్ఛకు కూడా పరిమితులుండాలి. దేశ భద్రతను తాకట్టుపెట్టే విధంగా భావస్వేచ్చ ఉండరాదు. అందుకే రాజ్యాంగ సవరణ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. దేశ వ్యతిరేకులను కీర్తిస్తూ ఫేస్‌బుక్‌లో అడ్డమైన రాతలు ఏమిటి? భారత రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు విద్యార్థులు ఉద్యమించాలి. అంతేకాని రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే శక్తులతో చేతులు కలపడం మంచిది కాదు. అదే సమయంలో మన కేంద్ర మంత్రులు లేదా మరికొన్ని విద్యార్థి సంఘాలు కూడా అత్యుత్సాహంతో వ్యవహరించి ఈ వివాదాన్ని జటిలం చేయడం సరికాదు. విద్యార్థి సంఘాలకు ఏ భావజాలం ఉన్నా ఫర్వాలేదు. కాని ఆ భావజాల రాజ్యాంగానికి లోబడి ఉండాలి. అత్యున్నమైన రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాల్సిన విద్యార్థుల గొడవను తమకు అనుకూలంగా రాజకీయ పార్టీలు మలుచుకుని అగ్నికి ఆజ్యం పోయడం సిగ్గుచేటు. దేశ భద్రతతో ముడిపడి ఉన్న అంశాలపై ఢిల్లీ వీధుల్లో జరుగుతున్న అర్థంపర్థం లేని ఉద్యమాలకు విద్యార్థి సంఘాలు స్వస్తి చెప్పాలి. ఇక ఈ గొడవకు ఫుల్‌స్టాప్ పెట్టే విధంగా కేంద్రం కూడా హుందాగా వ్యవహరించాలి. దేశ విద్రోహులను స్మరించే సభలకు హాజరైన వారిపై చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. విద్యార్థులు ఇక తమ లక్ష్యాలపై దృష్టి పెట్టడం మంచిది. ఇటీవల కాలంలో నెలరోజులుగా జరుగుతున్న సంఘటనలు సిగ్గుతో తలవంచుకునేవి.

- ఎస్ సలాం బాబు అధ్యక్షుడు, వైకాపా విద్యార్థి సంఘం ఏపి శాఖ