ఫోకస్

స్వాతంత్య్ర సమర యోధుల్ని అవమానిస్తున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 10వ తేదీ నుండి జరుగుతున్న పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. మా విశ్వవిద్యాలయం ప్రధానంగా భారత్, దక్షిణాసియా పరిణామాలపై పరిశోధనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. భారతీయ విశ్వవిద్యాలయాల్లో వాక్‌స్వాతంత్య్రానికి దెబ్బతగలడం సహించరాని అంశం. ప్రధానంగా జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చాలా స్పష్టంగా కనిపిస్తున్న ఈ పరిణామాలు మమ్మల్ని సైతం దిగ్భ్రాంతి కలిగించాయి. సార్వభౌమాధికారానికి పెద్ద దిక్కుగా ఉండే వారందరి తరఫున, భారత్‌లో హక్కులకోసం పోరాడుతున్న వారందరి తరఫున మేం మద్దతుగా నిలిచాం, బ్రిటిష్ వారసత్వంగా వస్తున్న కొన్ని చట్టాలను ఇప్పటికీ భారత్ అమలుచేస్తోంది, అనధికారికంగా అదుపులోకి తీసుకోవడం, సాక్ష్యాధారాలు లేకుండా అభిశంసన చేయడం వంటివి చాలా ఉన్నాయి. జాతి వ్యతిరేకత అంటే ఏమిటో ముందు స్పష్టం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. జాతి వ్యతిరేకంగా వ్యవస్థలు పనిచేస్తున్నాయా లేదా వ్యక్తులు పనిచేస్తున్నారా లేదా ఒక వర్గం పనిచేస్తోందా అనేది కూడా తేలాల్సి ఉంది. కన్హయ కుమార్, సర్ గిలాని తదితరుల అరెస్టులు అలాంటి అనుమానాలకు తావిస్తోంది. అధికారంకోసం పాకులాడే క్రమంలో ఒక వర్గం చేస్తున్నదే జాతి వ్యతిరేకంగా అనిపిస్తోంది. స్వాతంత్య్రంకోసం తీవ్రంగా పోరుసల్పిన సమరయోధులను అవమానించే రీతిలో నేటి పరిణామాలు కనిపిస్తున్నాయి, అణచివేతను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయంలో సరైన చర్యలు చేపట్టాలని మేం వైస్ ఛాన్సలర్‌ను కోరుతున్నాం. ఈ మేరకు మేం విసికి ఒక లేఖ రాశాం, దానిపై మా విద్యార్థులు, ఫ్యాకల్టీ అంతా సంతకాలు చేశారు. సంతకాలు చేసిన వారిలో మోనికా ఘోష్, మానిషా దాస్ గుప్త, సుబ్రమణియన్ శంకర్, శంకరన్ కృష్ణ, నెడ్ బెర్జ్, మిరియం శర్మ, సాయి , అన్న స్టిర్, ఫిలాసఫీ ప్రొఫెసర్ అరిందం చక్రవర్తి, వ్రిందా దాల్మియా, ప్రియం దాస్, అశోక్‌దాస్, రాజీవ్ మహాబీర్, రిచర్డు ఫ్రాస్టెర్, శర జమాల్ ఉన్నారు.

-జాస్ రాస్ నుట్సన్ యూనివర్శిటీ ఆఫ్ హవాయి, మనావో