ఫోకస్

ధరల పెరుగుదల పట్టదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓట్ల ఆలోచనే తప్ప ధరల పెరుగుదల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ, బతకడమే గగనమైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి ప్రతిపక్షాలను దెబ్బతీయడం, ఫిరాయింపులను ప్రోత్సహించడం వంటి చర్యలకు ప్రభుత్వాలు పాల్పడుతున్నాయే తప్ప ధరల పెరుగుదల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కూరగాయాల ధరలకు రెక్కలొచ్చాయి. ధరలను అదుపు చేయడం ప్రభుత్వాల బాధ్యత కాదా? ధరల అదుపు చేయడం అంటే రైతులకు నష్టం కలిగించాలనుకోవద్దు. పంట పండించే రైతన్నలు బాగుంటేనే దేశం బాగుంటుంది. వినియోగదారులూ నష్టపోరాదు. అటువంటప్పుడు ఏమి చేయాలంటే, ఉదాహరణకు మహారాష్ట్ర నుంచి భారీగా ఉల్లిపాయలు దిగుమతి అవుతున్నాయి. తద్వారా రాష్ట్రంలో ఉల్లి పండించి రైతులకు నష్టం వాటిల్లుతుంది. దిగుమతి ఎక్కువ కావడంతో ఉల్లి ధరలు పడిపోతాయి. ఇటువంటి విషయాల్లో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. అవసరమైన మేరకే దిగుమతి చేసుకోవాలి. రైతులు నష్టపోకుండా సబ్సిడీ ఇవ్వాలి. వినియోగదారులకూ అది వర్తింపజేయాలి.కానీ ప్రభుత్వాలు ఇవేమీ పట్టించుకోవడం లేదు. చాలామంది ప్రజాప్రతినిధులు ప్రతిరోజూ మీడియాలో కనిపించాలన్న తపన తప్ప పెరుగుతున్న నిత్యావసర ధరల తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలేమిటీ? ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు, సలహాలు చేద్దాం అనే దిశగా ఆలోచన చేయడం లేదు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సంతోషం, కానీ ప్రారంభం నుంచే రోహిత్, కన్హయ్య ఘటనలపై పార్లమెంటు అట్టుడుకిందే తప్ప పేదలు, మధ్య తరగతి ప్రజల గురించిగానీ, పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించిగానీ ఆలోచన చేయలేదు. ఇది చాలా బాధాకరం. చిన్నజీతం ఉండే ఆశావర్కర్లు ఎలా బతుకుతారు? ముఖ్యంగా మహిళలైన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, మాయావతి పరస్పరం నిందించుకోవడం కాకుండా పెరిగిన ధరల గురించి, బాధ పడుతున్న పేద, మధ్య తరగతి మహిళల గురించి మాట్లాడి ఉంటే బాగుండేది. ప్రజలు హర్షించేవారు. కానీ వారికి రాజకీయాలు ముఖ్యం. ఇప్పటికైనా నేతలు మారాలి. పేద ప్రజల రాతలు మార్చాలి.

-నేరెళ్ళ శారద, అధ్యక్షురాలు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్