ఫోకస్

ప్రభుత్వ విధానాలు మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ విధానాలు మారినప్పుడే ఏ పథకమైనా ప్రజలకు మేలు చేస్తుంది. కూరగాయలు పండించే రైతులకు ప్రోత్సాహమూ లేదు, గిట్టుబాటు ధరా లేదు. అలాగని వినియోగదారులకు తక్కువ ధరలకు కూరగాయలు అందుబాటులో ఉన్నాయా అంటే అదీ లేదు. కూరగాయల ధరలు చుక్కలను అంటుతున్నాయి. మధ్యలో దళారులు బాగుపడుతున్నారు. వ్యవస్థ మొత్తం ప్రక్షాళన జరగాలంటే ముందు ప్రభుత్వ విధానాల్లో మార్పులు రావాలి. అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. ప్రస్తుతం ఉల్లి పంట, టమోటా పంటలు రైతులకు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఉల్లి ధర ఒక్కసారిగా కుదేలైపోయింది. కిలో రూ.4 లేదా 5కి మించిలేదు. ప్రభుత్వం కిలో రూ.8 వంతున కొనుగోలు చేస్తుందని తెలిపింది. కానీ ఇంతవరకు ఒక్క కిలో ఉల్లిపాయ కొనుగోలు చేసింది లేదు. మార్కెటింగ్ శాఖ ఈ విషయంలో సీరియస్‌గా తీసుకోవాల్సిందిపోయి అసలు స్పందనే లేదు. టమోటా ధరలు కూడా బాగా పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలా పంట అధికంగా వచ్చినప్పుడు సంరక్షించుకునే విధానం ఉన్నా ప్రభుత్వం ప్రోత్సహించడం లేదు. కోల్డ్ స్టోరేజ్ సదుపాయం ఉన్నప్పటికీ రైతులకు అందుబాటులోకి రావడం లేదు. రైతు బంధు పథకం ఒకటి ఉంది. అదీ సక్రమంగా అమలు జరగడం లేదు. రైతు బజార్ల వ్యవస్థను గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకువచ్చింది. కొంతకాలం బాగానే అమలు జరిగింది. కానీ ఇప్పుడు అవి రైతు బజార్లుగా లేవు. దళారులు, వ్యాపారులు తమ వ్యాపారాన్ని చేసుకునేందుకు ఇచ్చిన వసతిగా మారాయి. రైతుబంధు గానీ, రైతు బజార్ల వ్యవస్థపై గానీ ప్రభుత్వం వరుస సమీక్షలు చేయాలి. రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తే ఒక గ్యారంటీ ఉంటుంది. అటు వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు, సరసమైన ధరలకు అందుతాయి. ఇందుకు దీర్ఘకాలిక ప్రణాళికను అమలుచేయాలి. పట్టణాలు, నగరాలకు సమీపంలో ఉద్యానపంటలు పండించుకోవడానికి వీలుగా తగిన ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి రావాలి. అందుకు కొంత భూమిని కేటాయిసే కూరగాయలు పండించి తక్కువ ధరకు విక్రయించేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు రైతుకు, వినియోగదారుడికి లాభం చేకూరుతుంది. ప్రభుత్వం రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళితే ఆశించిన ఫలితం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

- కె.వి.వి.ప్రసాద్ రైతు సంఘం (సిపిఐ), ప్రధాన కార్యదర్శి