ఫోకస్

ప్రజాస్వామ్యంలో ఇదో మైలురాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ ఎన్నికలైనా, స్థానిక సంస్థల ఎన్నికలైనా ఇవిఎం విధానంలో ఓటర్లు ఓటు వేసిన తర్వాత వారు ఓటు వేసినట్టు రసీదు ఇవ్వడం ప్రజాస్వామ్య విధానంలో భాగమే! రాజకీయ పార్టీలు, సాధారణ ప్రజలు ఈ అంశంలో చాలాకాలం నుండి రసీదు ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఒక ఓటరు బ్యాలెట్ పేపర్ విధానంలో ఓటు వేస్తే, స్వయంగా తన ఓటును బ్యాలెట్ బాక్స్‌లో వేస్తారు. దాంతో ఓటు వేశానన్న సంతృప్తి లభిస్తుంది. మరి ఇవిఎం విధానంలో ఓటు వేస్తే ‘బీప్’ అంటూ శబ్ధం వస్తుందే తప్ప, తాము వేసిన ఓటు తాము ఎంపిక చేసుకున్న అభ్యర్థి లెక్కలోకి పడుతుందో లేదో, అసలు తన ఓటు పడ్డదా అన్న అనుమానం కలుగుతోంది. అందువల్ల ఇవిఎం విధానంలో ఓటు వేసిన తర్వాత ఓటు పడ్డట్టు రసీదు లభిస్తే వారికి సంతృప్తి కలుగుతుంది. ఇందుకోసం ఇప్పటికే వినియోగిస్తున్న ఇవిఎంలలో స్వల్పమార్పులు చేర్పులు చేయడమో, లేక కొత్తగా ఇవిఎంలను రూపొందించడమో చేయాలి. రసీదులు ఇవ్వడం ‘పైలట్ ప్రాజెక్ట్’ ప్రాతిపదికపై ప్రారంభమైంది. ప్రజాస్వామ్యంలో ఇదో మైలురాయిగా దీన్ని భావించవచ్చు. సమాజంలో అక్షరాస్యత పెరగాలి. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటోంది. చదువుకున్న వారితోపాటు, చదువులేని వారు కూడా తమ ఓటును పూర్తిగా వినియోగిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది. ఓటు వేసేందుకు ఏర్పాటయ్యే క్యూలైన్లలో నిలబడాలా అన్న ఆలోచన చాలామందిలో కలుగుతోంది. గంటల తరబడి ఎండలో నిలబడాల్సి ఉంటుంది. అందువల్ల చాలా మంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం లేదు. మరికొంత మంది ‘డ్యూటీ’ కారణంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయలేకపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతున్నందువల్ల ఓటర్లు ఆన్‌లైన్‌లో (ఇ-ఓటింగ్ విధానం) ఓటువేసే సదుపాయాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. మారుతున్న కాలమాన పరిస్థితిలో ఎన్నికల ప్రక్రియలో కూడా మార్పులు జరగాల్సిందే! ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడం, చట్టసభలు చట్టాలు చేయడం భాగంగా ఉంటూ వస్తోంది. వ్యవస్థ బాగానే ఉంది. కాని డెమోక్రసీ ‘స్పిరిట్’కు మాత్రం విలువ లేకుండా పోయింది. చట్టసభలో విపక్షాల అభిప్రాయానికి అధికార పక్షం గౌరవం ఇవ్వాలి. విపక్షాల అభిప్రాయంపై చర్చ జరపాలి. ప్రజలకు మంచి జరిగేట్టయితే ఈ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని అమలుచేయాలి. అంతేకాని విపక్షాల గొంతు నొక్కకూడదు. ఇదే ప్రజాస్వామ్య స్పిరిట్.

- రమాకాంతరెడ్డి ఐఎఎస్ (రిటైర్డ్) రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్