ఫోకస్

విద్యార్థి సంఘాలకు స్వీయ నియంత్రణ ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూనివర్శిటీల్లో విద్యార్థులు ప్రశాంతంగా విద్యను అభ్యసించే వాతావరణం ఉండాలి. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే రాజకీయాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ యువనేత, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ రాలేదు. విద్యార్థులకు మనోధైర్యం కల్పించేందుకు రెండుసార్లు వచ్చారు. అలాగే ఇతర పార్టీలకు చెందిన నాయకులు సైతం రావడం జరిగింది. అయతే దాన్ని కూడా పెద్ద విషయంగా చిత్రీకరించారు. ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా అనేక వర్శిటీల్లో అలజడి పెరుగుతోంది. దీనికి కారణం - తమ ఆధిపత్యం కోసమని కొన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు వర్శిటీల్లో సైద్ధాంతిక చర్చలను ప్రారంభించడమే. ఇవి చిలికి చిలికి గాలివానగా మారి చివరకు ఉద్యమాలకు, విద్యార్థుల్లో అశాంతికి కారణమవుతున్నాయి. తమ భావాలను స్వేచ్ఛగా వెల్లడించే హక్కు విద్యార్థులకు ఉంది. విద్యార్థి దశలో అనేక అంశాలపై చర్చలు, విభిన్నమైన వాదనలు సాగుతుంటాయి. వాటిని దేశ వ్యతిరేక చర్యలుగా భావించడానికి వీల్లేదు. విద్యార్థి దశ ముగించుకుని సమాజంలోకి అడుగుపెట్టిన తర్వాత సమాజహితం, దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే విద్యార్థులు పాటుపడుతుంటారు. కాని ఇటీవల కాలంలో కొన్ని శక్తులు విద్యాలయాలను తమ స్వార్థ ప్రయోజనల కోసం కుల, మత, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టి, విద్యార్థుల మధ్య చిచ్చుపెడుతున్నాయి. ప్రతి అంశాన్ని వివాదం చేయడం తగదు. విద్యార్థులు తమ భావాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు కేంద్రాలుగా విద్యాలయాలుండాలని భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేర్కొన్న విషయం ఇక్కడ మనం గమనించాలి. యూనివర్శిటీల్లో కూడా విద్యార్థి సంఘాలు స్వీయ నియంత్రణతో వ్యవహరించడం మంచిది.

- వంశీచంద్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే