ఫోకస్

దురాచారాలకు అడ్డుకట్ట వేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ సంప్రదాయానికి సంబంధించిన దేవాలయంలోనైనా విగ్రహాన్ని ప్రతిష్టించేప్పుడు తప్పనిసరిగా ఆగమ శాస్త్రాలను పాటిస్తారు. ఆ తర్వాత గర్బగుడిలోకి ఎవరినీ అనుమతించరు. ప్రత్యేకించి మూల విరాట్టును ముట్టుకోవడానికి అనుమతించరు. ఆ దేవాలయాలకు చెందిన ప్రధాన అర్చకునికి తప్ప ఇతరులెవ్వరూ మూల విరాట్టును ముట్టుకునేందుకు అర్హులుకారు. సమాజంలో సమానత్వం గురించి మాట్లాడేవారు గర్బాలయంలోకి ప్రవేశిస్తాం, మూల విరాట్టును ముట్టుకుంటాం అంటున్నారు. కొన్ని దేవాలయాల్లో మూల విరాట్టును ప్రతిష్టించిన తర్వాత లింగ బేధంతో సంబంధం లేకుండా గర్బాలయంలోకి అనుమతించరు. శాస్త్ర ప్రకారం అనుమతించరని గమనించాలి. ఉదాహరణగా చెప్పాలంటే నేను బ్రాహ్మణున్ని, పైగా నిత్యం నియమ నిష్టతో పూజలాచరిస్తాను. అయినా తిరుమలకు వెళితే శ్రీ వేంకటేశ్వర స్వామిని ముట్టుకోవాలంటే సాధ్యమవుతుందా? కాదు... అక్కడ ప్రధాన అర్చకుడు తప్ప ఎవరూ స్వామివారిని ముట్టుకోవడానికి వీలులేదు. కొందరు సమాజంలో ఇటువంటివి లేవదీసి అశాంతికి గురి చేసి, చీలికలు తేవాలని కుట్ర చేస్తున్నారు. ఇటువంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సంప్రదాయాలను, అలయ నియమాలను, మర్యాదలను బట్టి మనం నడుచుకోవాల్సి ఉంటుంది. అటువంటి వాటిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇటువంటి సున్నితమైన అంశాల్లో ఎవరూ జోక్యం చేసుకోరాదు. సంప్రదాయాల ప్రకారం పండితులు, పూజారులు నిర్వహిస్తారు. వారిపై వత్తిళ్ళు ఉండకూడదు. మహిళలు దేవతామూర్తులను ముట్టుకుంటే తప్పేమిటీ? అని అంటున్నారు. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే మహిళలకు నెలసరి ఇబ్బంది ఉన్నందున 40 రోజుల అయ్యప్ప దీక్ష చేపట్టేందుకు అవకాశం లేదు. అయితే వారికి మరో అవకాశం కల్పించడం జరిగింది. 60 ఏళ్ళ పైబడినవారు, నెలసరి ఇబ్బంది లేనివారు శబరిమలై వెళుతున్నారు. అక్కడ వారికి ఎటువంటి అడ్డంకులు లేవన్న విషయాన్ని గమనించాలి. కొన్ని దేవాలయాల్లో డ్రెస్‌కోడ్ ఉంది. ప్యాంటు, షర్టులతో అనుమతించరు. కాబట్టి ఆయా దేవాలయాల నియమ, నిబంధనలను ప్రతి ఒక్కరు గౌరవించాలి. హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. హిందూ సంప్రదాయాలను దెబ్బతీయాలనుకునే వారిని ఒక కంట కనిపెడుతూ, వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి.

- ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యే, తెలంగాణ బిజెపి సీనియర్ నాయకుడు