ఫోకస్

న్యాయవ్యవస్థలో సంస్కరణలు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం మన దేశంలో న్యాయవ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, హిందూమతానికి సంబంధించిన అంశాలపై కోర్టులు ఇస్తున్న తీర్పులు పరిశీలిస్తే, భారతీయ ఆచార, వ్యవహారాలకు కోర్టులు ప్రాధాన్యత ఇవ్వడం లేదని స్పష్టమవుతోంది. మహిళలకు హిందూమతం, భారతీయ సంస్కృతి మహోన్నతమైన స్థానం కల్పించాయి. శివుడి ఆలయాల్లో తొలుత అమ్మవారికి పూజలు చేసిన తర్వాత శివుడికి పూజలు చేస్తారు. అలాగే వైష్ణవ ఆలయాల్లో లక్ష్మీదేవి, ఆండాల్ అమ్మవారికి పూజలు చేసిన తర్వాత పెరుమాళ్లకు పూజలు చేస్తారు. మనదేశంలో ఆహ్వాన పత్రికల్లో శ్రీమతి అండ్ శ్రీ అని రాస్తారు. విదేశాల్లో అయితే మిస్టర్ అండ్ మిసెస్ అని రాస్తారు. పిల్లలకు అక్షరాభ్యాసం సందర్భంగా ‘అమ్మ’ అని రాయిస్తారే తప్ప ‘నాన్న’ అని రాయించరు. ఒక ఇంట్లో మహిళను గృహిణి అంటారు.. అంటే ఇల్లుగల ఆవిడ అని అర్థం, మగవారిని గృహస్తు అంటారు.. అంటే గృహంలో ఉండేవారని అర్థం. నిశితంగా పరిశీలిస్తే మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు స్పష్టమవుతోంది. మహిళలను బాధించేవారిని రాక్షసులుగా, మహిళలను కాపాడేవారిని దేవుడిగా భావించే సంస్కృతి హిందూ సంస్కృతి. మన దేశంలో మహిళలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్టు వాస్తవ పరిస్థితి తెలియచేస్తోంది. ఇక శని సింగ్నాపూర్ ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హిందూమతానికి సంబంధించిన దేవాలయాల్లో స్థానిక ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తరతరాలుగా ఈ ఆచార వ్యవహారాలను హిందువులంతా అమలు చేస్తున్నారు. కేరళ రాష్ట్రం త్రివేండ్రంలోని ఒక ఆలయంలో ఏటా జరిగే ఉత్సవాల సందర్భంగా ఐదు లక్షల నుండి పది లక్షల మంది మహిళలు పాల్గొని, ‘పొంగలి’ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. తమ కుటుంబం బాగుండాలని అమ్మవారిని కోరతారు. ఈ ఆలయంలో మహిళలతోపాటు పురుషులు కూడా పొంగలి చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టమంటూ ఎవరైనా పిల్ వేస్తే, కోర్టులు అంగీకరించి అందుకు అనుగుణంగా తీర్పు ఇస్తాయా? మసీదుల్లో మహిళల ప్రవేశానికి అనుమతించాలంటూ కోర్టులు తీర్పులు ఇస్తాయా? మసీదుల్లో మహిళల ప్రవేశానికి సంబంధించి ఎవరైనా ‘పిల్’ వేస్తే ముల్లాలతో కాని, ఇతర ముస్లిం మతపెద్దలతో కాని కోర్టులు చర్చించకుండా తీర్పు ఇస్తాయా? అంటే ఒక మత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేముందు ఆ మతానికి సంబంధించి, ఆయా ప్రార్థనా స్థలాల్లో ఆచరించే ఆచారాల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత కోర్టులపై ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో జాతీయ స్థాయిలో చర్చలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భగవంతుడికి భక్తులంతా సమానమే. స్ర్తిలు, పురుషులు అన్న వివక్ష లేదు. భక్త్భివమే ముఖ్యం తప్ప, లింగవివక్షకు అవకాశం లేదు.

- స్వామి పరిపూర్ణానంద, పీఠాధిపతి, శ్రీపీఠం, కాకినాడ.