ఫోకస్

చదవేస్తే ఉన్న మతి పోయినట్టుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో యువతలో మానవతా విలువలు దిగజారిపోతున్నాయి. రోజురోజుకూ ప్రసార మాధ్యమాలు, ఐటి టెక్నాలజీ యువతీ, యువకులకు యమస్పీడ్‌గా అందుబాటులోకి వస్తోంది. పాశ్చాత్య సంస్కృతిని పెంపొందిస్తోంది. దీంతో దేశ సంస్కృతితోపాటు మానవతా విలువలు పడిపోతున్నాయి. యువతీ, యువకులు సమాన హోదాల్లో పనిచేస్తూ, సమాన వేతనాలు పొందుతూ, సమాన స్థాయిలోనే పార్టీలు, పబ్‌లకు అలవాటుపడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా వావివరసలు మరచి విచ్చలవిడిగా జల్సాలకు బానిసలవుతున్నారు. ఈమధ్య కాలంలో మంత్రుల కొడుకులు అసభ్య ప్రవర్తన, సెటిల్‌మెంట్లు వంటి కార్యకలాపాలకు పాల్పడుతూ తమ నైతికతను దిగజార్చుకుంటున్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. యువతులు తమ బాయ్‌ఫ్రెండ్‌తో కలసి పబ్‌లకు వెళ్లేందుకు వారి తల్లిదండ్రులు అనుమతిస్తున్న సంస్కృతి మంచిది కాదు. దీనికి ఐటి, టెక్నాలజీ అందరికీ చేరువవ్వడం, ఇంటర్నెట్, ఆన్‌లైన్ వ్యాపారం, షాపింగ్, ఫేస్‌బుక్ పరిచయం వంటివి యువతను పెడదారి పట్టిస్తున్నాయి. తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రుల కోరిక మహోన్నతమైనదే. కానీ చదువెక్కువై పెడదారిన పడుతోన్న యువత ‘చదవేస్తే.. ఉన్న మతి పోయిన’ చందంగా మారింది. ఒంటరిగా కనీసం సినిమాకు వెళ్లేందుకు కూడా సాహసించని మహిళలు నేడు స్వేచ్ఛగా పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, హుక్కా సెంటర్లకు వెళుతున్నారు. పెళ్లికి ముందే బాయ్‌ఫ్రెండ్స్‌తో ఏళ్ల తరబడి కలసి తిరుగుతున్నారు. బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్స్‌లను కలుసుకోవడం దినచర్యల్లో భాగమైంది. యువతీ, యువకుల్లో స్వేచ్ఛ మితిమీరింది. దీంతో యువతీ, యువకులు వావివరసలు లేకుండా మానవతా విలువలు కోల్పోవలసి వస్తోంది.

-జగన్‌మోహన్ మెట్ల లోక్‌సత్తా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి