ఫోకస్

ఎమ్సెట్ ఎందుకు పెట్టారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీట్ ద్వారా మాత్రమే దేశవ్యాప్తంగా మెడికల్ సీట్లను భర్తీ చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారనేది సుస్పష్టం. ఈ నిర్ణయంతో తెలుగులో చదువుతున్న గ్రామీణ ప్రాంత దళిత, గిరిజన వెనుకబడిన మైనార్టీ విద్యార్థులకు నష్టం వాటిల్లుతుంది. ఈ విద్యాసంవత్సరం నుండి నీట్ నిర్వహించాలని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా, మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్సెట్‌ను ఎందుకు నిర్వహించిందో రెండు తెలుగు రాష్ట్రాలూ చెప్పాలి. గత ఏడాదే చూచాయిగా కేంద్రం నీట్‌కు సంబంధించి చెప్పినా, విద్యార్థులను నీట్‌కు అనుగుణంగా సిద్ధం చేయలేదు, విద్యార్థులకు జరిగిన నష్టానికి పూర్తి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలే వహించాలి. నీట్ సిబిఎస్‌ఇ సిలబస్‌లో ఉండటం వల్ల విద్యార్థులు సీటు అర్హత కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. వివిధ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఫలితాలకోసం ఎదురుచూస్తున్నారు. ఈ సీట్లను ఎలా భర్తీ చేయాలనుకుంటున్నారో కూడా ప్రభుత్వాలు స్పష్టం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.

- మూడ్ శోభన్ నాయక్ ప్రధాన కార్యదర్శి గిరిజన విద్యార్థి సమాఖ్య