ఫోకస్

గ్రామీణ విద్యార్థులకు న్యాయం జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ స్థాయిలో వైద్య కళాశాలల్లో నీట్ పరీక్షను నిర్వహించాలనే ఆలోచన మంచిదే. కాని ఒక ఏడాది ముందుగా దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తే బాగుండేది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. నీట్ పరీక్ష సిబిఎస్‌ఇ సిలబస్‌లో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ప్రాంతీయ మీడియంలో ఇంటర్‌ను చదువుతారు. వారికి జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కొనే సత్తా ఉండదు. కొంతమంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఉండవచ్చు. కాని మెడిసెన్‌లో చేరాలనుకునే వారు మొదటి నుంచి కార్పోరేట్ కాలేజీల్లో కోచింగ్ తీసుకుంటారు. ఈ ఏడాది జూలై 24వ తేదీనే నీట్ పరీక్ష రాసి అడ్మిషన్లు పొందాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గ్రామీణ విద్యార్థులకు సమస్య. ఈ విషయాన్ని మానవతా హృదయంలో సర్వోన్నత న్యాయస్థానం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇప్పటికిప్పుడు నీట్ అంటే విద్యార్థులపై వత్తిడి తెచ్చినట్లే. అన్ని వర్గాలకు సమాన న్యాయం జరగాలంటే ఒక్క ఏడాది అంటే వచ్చే ఏడాది 2017-18 సంవత్సరానికి నిర్వహిస్తే సరిపోతుంది. ఈలోగా విద్యార్థులకు కూడా సిలబస్‌ను అప్‌డేట్ చేయవచ్చు. నీట్ పరీక్ష విధానంపై విద్యార్థులకు తెలుస్తుంది. నీట్ పరీక్ష మంచిదే. దీనిని ఎవరూ కాదనలేరు. ప్రతిభావంతులైతే దేశంలో ప్రముఖ వైద్య కళాశాలల్లో సీటు వస్తుంది. అనేక వైద్య కళాశాలలకు వేరువేరుగా దరఖాస్తులు, ఫీజులు చెల్లించే పని తప్పుతుంది. ఈ విషయమై కేంద్రం, సుప్రీం కోర్టు ఒక స్పష్టత ఇవ్వాలి. నీట్‌ను ప్రాంతీయ మీడియంలో నిర్వహించడమే కాకుండా దానికి సంబంధించిన సిలబస్‌ను ప్రకటించాలి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ జరిగింది. విద్యార్థులు రెండేళ్లుగా ఈ పరీక్షకు ప్రిపేరై రాశారు. ఈ ఎమ్సెట్‌కు విలువ ఉంటుందా ఉండదా అనే వత్తిడిని విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల విశాల ప్రయోజనాల దృష్ట్యా ఒక ఏడాది ఆగితే మంచిది.

- విశే్వశ్వరరెడ్డి వైకాపా శాసనసభా పక్ష ఉపనేత