ఫోకస్

‘నీట్’గానే ఉంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీట్ నిర్వహించడం చాలా మంచిది. అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రైవేటు వైద్య కళాశాలల పెత్తనం పోతుంది. మరోవైపు విద్యార్థుల్లో జాతీయభావం పెంపొందుతుంది. జాతీయ స్థాయిలో జరిగే ‘నీట్’తో విద్యార్థులు ఎక్కడైనా అంటే ఏ రాష్ట్రంలోనైనా సీటు సాధించవచ్చు. ఫలితంగా మిశ్రమ కలయిక ఏర్పడి, మీ, మా అనే భేద భావం లేకుండా జాతీయవాదం బలపడుతుంది. దేశంలోని విద్యార్థులంతా ఒక్క ‘నీట్’ పరీక్షకే హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రైవేటు, కార్పోరేట్ విద్యా సంస్థల పెత్తనం పోతుంది. ఆ సంస్థల పోకడవల్ల ఇంటర్మీడియేట్‌లో 95 శాతం నుంచి 97 శాతం వరకూ మార్కులు సాధించిన విద్యార్థులు (కొందరు) ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షలకు హాజరైనప్పుడు 40వేలు, 70వేల ర్యాంకుల వరకూ వెళుతున్నారంటే వారి విద్యా విధానం ఏపాటితో తెలిసిపోతున్నది. ప్రస్తుతం వైద్య కళాశాలలు, ఇతర వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన వాటిల్లో యాజమాన్య కోటాలు ఉన్నాయి. దీంతో ఆ కోటాలతో యజమాన్యాలు లాభాలు గడిస్తున్నాయి. పైగా ఆ కోటాలో రిజర్వేషన్లు ఉండవు. ‘నీట్’ నిర్వహించడం ఇటువంటి వాటికి చరమగీతం పాడేందుకు అవకాశం ఉంది. కాబట్టే ధనార్జనే లక్ష్యంగా పెట్టుకున్న విద్యా సంస్ధలు ఆందోళన చెందుతున్నాయి. విద్యను వ్యాపారంగా చూసేవారే కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంసెట్ నిర్వహించడంతో గందరగోళానికి, విద్యార్థులకు అయోమయానికి గురిచేసింది. ఈ పరిస్థితికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నీట్ నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు చెప్పింది. నీట్ నిర్వహణకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి నుంచే ప్రయత్నం జరుగుతున్నది. అయినా రెండు తెలుగు రాష్ట్రాలు అందుకు సంసిద్ధం కాలేదు. అయితే విద్యార్థుల్లో అయోమయం నెలకొన్నందున వెంటనే అమలు చేయకుండా వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తే బాగుంటుంది.

- డాక్టర్ శైలజానాథ్ సాకె ఎపిసిసి నేత, మాజీ మంత్రి