ఫోకస్

పెద్దల సభ గౌరవాన్ని దిగజార్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్థానిక సంస్థల నుంచి శాసన మండలికి జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీ పెద్దల సభకు ఉన్న గౌరవాన్ని దిగజార్చే విధంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 12 శాసన మండలి సభ్యులకు ఎన్నికలు నిర్వహిస్తుంగా, అందులో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కావడం వంటి ఘటనలు మునుపెన్నడూ జరుగలేదనే చెప్పాలి. ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేస్తున్న ఇతర పార్టీల అభ్యర్థులను అధికార పార్టీ కొనుగోలు చేసిందని, డబ్బు, పదవుల ప్రలోభాలకు లొంగిపోవడం వల్లే ఆరు స్థానాలు ఏకగ్రీవం కావడానికి కారణమని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే కావు, పచ్చి నిజాలని విపక్ష పార్టీలన్నీ విమర్శలు గుప్పిస్తున్నాయ. ఇంత జరిగినా అధికార పార్టీ జరిపిన బేరసారాలను ఆ పార్టీ నేతలు నిస్సిగ్గుగా సమర్థించుకోవడం మరీ దారుణం. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేయలేదా అని టిఆర్‌ఎస్ నేతలు ఎదురుదాడి చేయడం మరీ విడ్డూరంగా ఉంది. ఎవరో తప్పు చేశారని, అదే తప్పును మనం చేస్తూ ఎలాగ? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి వ్యవహారాలు చేశారనే ప్రజలు ఆ పార్టీని గద్దెదింపారనే విషయాన్ని టిఆర్‌ఎస్ నేతలు గుర్తు చేసుకోవాలి. ఎన్నికలను కూడా అపహాస్యం చేయడం ప్రజాస్వామ్య మనుగడకే ముప్పుగా పరిగణించాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాహాటంగా జరిగిన బేరసారాలపై ఎన్నికల కమిషన్ విచారణ జరిపి, బాధ్యులైన వారిపై, ప్రలోభాలకు గురిచేసిన పార్టీపై చర్యలు తీసుకోవాలి. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేలా వ్యవహరించిన పాలకపార్టీపై ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలి.

- గీతామూర్తి సామాజిక విశే్లషకురాలు