ఫోకస్

సినిమాను అలాగే చూడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉడ్తా పంజాబ్ సినిమాకు అనేక కట్స్ చెప్పినందుకే వాళ్లు రివైజింగ్ కమిటీకి వెళ్లారు. అక్కడికి వెళితే 94 కట్స్ చెప్పారు. అంటే 74 సన్నివేశాలు వుంటే అందులో 94 సన్నివేశాలు తీసేయమన్నారు. చాలా ఎక్కువ చెప్పారు. ఉడ్తా పంజాబ్ టైటిల్ పెట్టకూడదన్నారు. గోవా, గోవన్ అనే పేర్లతో డ్రగ్ మాఫియా సినిమాలు ఇదివరకే అక్కడ వచ్చాయి. పంజాబ్‌లో ఏదైతే జరుగుతుందో అదే పేరుతో తీస్తే వద్దని చెప్పడం ఘోరం. అలా తీయడంవల్ల యువతలో అవేర్‌నెస్ వస్తుందని దర్శక నిర్మాతలు ఆశించారు. యువతలో వున్న దారుణమైన పరిస్థితిని సరిదిద్దుకోవాలన్న ఆశతో వాళ్లు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమాలో వున్న పేర్లన్నీ మార్చేయమని మరో హుకుం కూడా జారీచేశారు. ఏదైనా సరే సినిమాను సినిమాగానే చూడాలి, అంతేగానీ ఓ రాజకీయ పార్టీ నేపథ్యం చూసి ఆ చిత్రాన్ని అంతగా కుళ్లబొడవాల్సిన అవసరం లేదు. అక్కడున్నవారు రాజకీయ పార్టీ వ్యక్తులలాగా ప్రవర్తించారు. ఇది దారుణమైన విషయం. అక్కడున్న వ్యక్తి కమర్షియల్ చిత్రాలు చాలా తీసిన వ్యక్తి. ఒక సినిమా తీయడానికి ఎన్ని కష్టనష్టాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. అయినాకానీ ఆయన ఓ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు. 94 కట్స్ ఇచ్చే బదులు, నిజంగా ఆ సినిమా సమాజాన్ని పాడుచేస్తుంది అనుకుంటే ఆ చిత్రాన్ని బ్యాన్ చేయవచ్చుకదా! బ్యాన్‌చేసే అధికారం వారికుంది కదా! ఈ సినిమా విడుదలైన సమాజాన్ని పాడుచేస్తుంది అనే ఓ ఫీలింగ్ నిజంగా వస్తే సినిమాను రద్దుచేయవచ్చు. ఆ సామాజిక బాధ్యత మీడియావాళ్లకుండాలి. డ్రగ్స్‌కు బానిసవుతున్న యువత గురించి ఓ సినిమా తీస్తే అది ఓ అవేర్‌నెస్‌లా వుంటుంది. దాన్ని ఖండఖండాలుగా నరికేస్తే ఇంకేముంటుంది? అందుకే సెన్సార్ విధానాలు సమాజానికి అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.

-వీర శంకర్, దర్శకుడు, హైదరాబాద్