ఫోకస్

పాత రూల్స్ మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెన్సార్ రూల్స్‌లో తప్పకుండా మార్పులు చేయాలి. ఎప్పటినుంచో వున్న రూల్స్‌ని ఇప్పుడు పాటించడం కరెక్టు కాదు. రోజులు మారాయి. ప్రేక్షకుల్లో కూడా చాలా మార్పు వచ్చింది. వారి అభిరుచికి తగ్గట్టుగా ఇప్పుడు సినిమాలు తీయాలి. లేదంటే వారు ఆ సినిమాలు ఎందుకు చూస్తారు చెప్పండి. నిజానికి ఈ రోజుల్లో టీవీల్లో వచ్చే సీరియల్స్, కమర్షియల్ యాడ్స్‌లో వస్తున్న సన్నివేశాలు కూడా సినిమాల్లో ఉండడం లేదంటే.. సెన్సార్ ఎంత దారుణంగా తయారైందో చూడండి. ఇప్పుడు సినిమాలో ఓ కులం గురించి తప్పుగా ఉంది, అలాంటి సన్నివేశాలు కట్ చేయాలనీ చెప్పారు, బానే వుంది. కానీ అదే సెన్సార్ వాళ్ళు మరో సినిమాలో ఇంకో కులానికి సంబంధించిన సన్నివేశాలు, మాటలు అలాగే ఉంచేస్తారు. ఏ సినిమా అయినా కులం గురించి మాట్లాడకూడదు కదా.. దాని గురించి అడిగితే.. ఆ.. అది అక్కడ అవసరం అని ఏవో కారణాలు చెబుతారు? రూల్స్ ఎవరికైనా రూల్సే కదా. సమానత్వం అనేది ఎక్కడైనా ఉండాల్సిందే. ఇక నేను తీసిన ‘16’ సినిమా సమయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఆ తరువాత మళ్లీ ‘దేనికైనా రెడీ’ సినిమా విషయంలో ఇలాంటిది రిపీట్ అయింది. ఇప్పుడు సెన్సార్ వాళ్ళు ఒక్కసారి సినిమాకు సెన్సార్ చేసి విడుదల చేసిన తరువాత దాన్ని ఆపకూడదు. కాని ఆ సినిమాను సెన్సార్ తరువాత కూడా విడుదల చేయొద్దని చెప్పారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ సినిమా విషయంలో ఒక కులం వాళ్ళు నానా గొడవ చేశారు. సెన్సార్‌వాళ్ళు ఈ విషయం గురించి అసలు పట్టించుకోలేదు. సెన్సార్ చేసిన తరువాత దానికి కట్టుబడి ఉండాలి. ఎప్పుడో పాత ఫార్ములాతో సినిమాలకు సెన్సార్ చేస్తే ఇప్పుడు సినిమాలు తీయడం కష్టమే. పరిస్థితులు మారిపోయాయి కాబట్టి.. సెన్సార్ విధి విధానాలు కూడా మారాలి. అప్పుడు అలాగే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా అలాగే చేస్తామంటే ఎలా? ఇటీవలే ఉడ్తా పంజాబ్ సినిమా విషయంలో కోర్టు తీర్పుతో ఆయన సెన్సార్ విధానాలు మారాలని కోరుకుంటున్నాను. కోర్టు కూడా ఒక సినిమాకు ఆ సినిమా ఏ రేటింగ్‌లో వుందని మీరు చెప్పారు కాని దాన్ని ఆపే హక్కు లేదని తీర్పు ఇచ్చింది. ఇకనైనా సెన్సార్ రూల్స్ మారిస్తే బాగుంటుంది.

-జి.నాగేశ్వర్ రెడ్డి, దర్శకుడు