ఫోకస్

శ్యాంబెనగల్ సిఫార్సులే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు, చేర్పులు చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్యాంబెనగల్ కమిటీ సూచనలను యథాతథంగా అమలుచేయాలి. సెన్సార్ బోర్డ్ అనగానే సీన్స్‌ను కత్తిరింపులు చేసే సంస్థ అన్న అపవాదు పోవాలి. ఇందుకు అనుగుణంగా ఫిలిం సర్ట్ఫికేషన్ బోర్డుగా పేరు మార్చాలన్నారు. ఫిల్మ్ సర్ట్ఫికేషన్‌లో కూడా కేవలం ఎ / యు / ఎయు అని కాకుండా మరికొన్ని క్యాటగిరీలు ఉండాలని సూచించారు. దాన్ని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఇతర కమిటీల సిఫార్సుల మాదిరి కాకుండా శ్యాంబెనగల్ కమిటీ సిఫార్సులను బుట్టదాఖలు చేయకుండా అమల్లోకి తీసుకురావాలి. బోర్డు నిర్మాణంలో కూడా మార్పులు, చేర్పులు జరగాలి. బోర్డును రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకూడదు. సినిమా రంగంపై పరిజ్ఞానం, నైపుణ్యం, అనుభవం ఉన్నవారు, సామాజిక కోణం కూడా తెలిసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. సెన్సార్ అంటే పోలీసింగ్ అన్న భావన నుండి వౌలికంగా మార్చాల్సి ఉంది. దృశ్యమాధ్యమం అద్భుతమైన భావ వ్యక్తీకరణ మాధ్యమం. అత్యంత ప్రభావవంతమైంది కూడా. యువత మొదలుకుని అన్ని రకాల ప్రేక్షకులపై సినిమా ప్రభావం చూపిస్తోంది. ప్రజల భాష, సంస్కృతి, జీవన సరళి సినిమాల్లో ప్రతిబింబిస్తున్నాయి. కళారూపంగా ప్రారంభమైన సినిమా ఎప్పటికప్పుడు ఎదుగుతున్న సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని విస్తరిస్తోంది. సినిమా వ్యాపారం కావడంతో ప్రేక్షకుల సున్నితత్వంమీద కంటే ఇంద్రియాలపై (సెనె్సస్) ప్రభావం చూపించే విధంగా సినిమాల నిర్మాణం కొనసాగుతోంది. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్.. ఇలా ఏ సినిమా ఐనా ఇదే వరవడిలో సాగుతోంది. వ్యాపారమే లక్ష్యంగా సాగే సినిమాలకు ప్రత్యామ్నాయంగా అర్థవంతమైన సినిమా లేదా భిన్నమైన సినిమా నిర్మాణానికి కొన్ని ప్రాంతీయ భాషల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తరహా సినిమాలు సమాజాన్ని, సామాజిక ఆటుపోట్లని దృశ్యమానం చేస్తూ సామాజిక చైతన్యం కల్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి. వాస్తవాలకు దగ్గరగా ఉండే కామెంట్లు చేసినప్పుడు సెన్సార్‌బోర్డు కోరలు చాచి తమ కత్తెరలకు పనికల్పిస్తోంది. వ్యాపారకోణంలో నిర్మాణం అవుతున్న సినిమాలు యువతపై చెడుప్రభావాన్ని చూపిస్తున్నప్పటికీ పట్టించుకోని సెన్సార్‌బోర్డు వాస్తవాలు చూపిస్తే, అభ్యంతరాలు లేవనెత్తుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ఖచ్చితంగా భావప్రకటన స్వేచ్ఛపై దాడిగానే భావించాలి. ఇటీవల ‘ఉడ్తాపంజాబ్’ సినిమాకు ఇదే విధమైన దెబ్బ తగిలింది. సెన్సార్ చట్టంలో, బోర్డు నిర్మాణంలో లోపాలు ఉండటమే ఇందుకు కారణం. సినీ దర్శకుడు తన అభిప్రాయాన్ని చూపించే స్వేచ్ఛ కలిగి ఉంటాడు. రాజ్యాంగం ఆ అవకాశం ఇచ్చింది. దేశ సమగ్రతకు భంగం కలగనంత వరకు స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు. కమలహాసన్ సినిమా విశ్వరూపాన్ని తమిళనాడు ప్రభుత్వం నిషేధించినట్టు రాజకీయకోణంలో సినిమాలను చూడవద్దు. అర్థవంతమైన సినిమాలు రావలసి ఉంది. సినిమాలు సెనె్సస్‌ను ఉత్తేజపరిచే విధంగా కాకుండా సెన్సిబిలిటీను పెంపొందించే విధంగా ఉండాలి.

- వారాల ఆనంద్, సినీ క్రిటిక్