ఫోకస్

చట్టంలో సమూల మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాటోగ్రఫీ చట్టంలో సమూల మార్పులు చేయాలి. ప్రాంతీయ భాషల్లో నిర్మించే చిన్న సినిమాలకు అవాంతరాలు వస్తున్నాయి తప్ప, భారీ పెట్టుబడితో నిర్మించే సినిమాలకు ఎలాంటి ఆటంకాలు కలగడం లేదు. అరవై ఏళ్ల క్రితం రూపొందించిన చట్టంలో ఉన్న లొసుగులను దర్శక, నిర్మాతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇందులో సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ కోణంలో అధ్యయనం చేసి చట్టాన్ని మార్చనంత వరకు సినీ రంగంలో అక్రమాలకు కొనసాగుతూనే ఉంటాయి. సెన్సార్ బోర్డ్ నేతృత్వంలో జరిగే సినిమాల సెన్సార్ తర్వాత కూడా అవే దృశ్యాలతో సినిమాలను ప్రదర్శిస్తున్నా, నియంత్రించే యంత్రాంగం లేదు. దీనిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు అధికారం ఉంటుంది. అయితే పోలీసులకు ఫిర్యాదు అందితే తప్పవారు కల్పించుకోరు. సంబంధిత అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అప్పుడు పోలీసులు ఆ థియేటర్‌లో ఆపరేటర్‌ను అరెస్ట్ చేసి కేసు పెడతారు. ఫిర్యాదు చేసిన వారు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వాస్తవంగా తప్పు జరిగితే సినిమా దర్శకుడు, నిర్మాతలపై కేసు నమోదు చేయాలి. కాని ప్రస్తుతం అమల్లో ఉన్న సినిమాటోగ్రఫీ చట్టం-1952 ప్రకారం వారిపై కేసులు నమోదు చేసేందుకు వీలులేదు. అంటే సెన్సార్‌బోర్డు ఏవైతే సీన్లను తొలగించాలని ఆదేశించిందో వాటిని ప్రదర్శించినా దర్శక నిర్మాతలపై కేసు నమోదు చేసేందుకు వీలులేదన్నమాట. అంటే ఇక్కడ తప్పు చట్టంలోనే ఉంది తప్ప ఇతరత్రా లేదు. రాజకీయాలకు చోటులేని విధంగా నిపుణులతోనే బోర్డును ఏరాటు చేయాలి. ఇందుకు అనుగుణంగా చట్టంలో మార్పులు చేయాలి.

- పల్లె నర్సింహ, అధ్యక్షుడు తెలంగాణ ప్రజానాట్య మండలి.