ఫోకస్

ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెన్సార్ అనేది.. ఒక సినిమాకు రేటింగ్ మాత్రమే ఇవ్వాలి. ఈ సినిమాను అందరూ చూడొచ్చు అంటే ‘యు’, పెద్దవాళ్ళు మాత్రమే చూడాలి అంటే ‘ఎ’, లేదు పెద్దవాళ్ళతో కలిసి పిల్లలు కూడా చూడొచ్చు అంటే ‘యు/ఎ’. అంతేకాని వారికి ఇష్టం వచ్చినట్లు సినిమా సెన్సార్ చేస్తే ఎలా? ఇండియన్ రూల్స్ రెగ్యులేషన్ పద్ధతిలో ఈ సినిమాలో ఈ సన్నివేశం ఇలా వుంది, ఆ సన్నివేశంలో మాటలు ఇలా ఉన్నాయి. కాబట్టి ఆ మాటలను బట్టి దానిని రేటింగ్ ఇవ్వండి. అంతేకాని ఆ సీన్ ఉండొద్దు, ఈ మాటలు బీప్ చేయండి అంటూ డిక్టేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఒక్కోసారి అయితే మొత్తం పాటనే తీసివేయమని చెబుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం. ఒక క్రియేటర్‌ను డిక్టేట్ చేసే అధికారం వారికి లేదు. ఇటీవలే ‘ఉడ్తా పంజాబ్’ సినిమాను బ్యాన్ చేయమన్నారు. అసలు ఒక సినిమాను బ్యాన్ చేయమనే అధికారం వారికి లేదు. ఒక క్రియేటర్‌గా సమాజంలో ఉన్నాం కాబట్టి ఏం ఉండాలి, ఏం ఉండకూడదో మాకు తెలుసు కదా. మాకూ పరిధులు ఉంటాయి. ఆ పరిధిలోనే మేం సినిమా చేస్తాం. కాని సెన్సార్ వాళ్ళు మాత్రం వారి పరిధిలో వారు పనిచేయడం లేదు. నేను తీసిన ‘గీతాంజలి’ సినిమా విషయంలో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అసలు ఆ సినిమాకు ‘ఎ’ రేటింగ్ ఇవ్వడం నిజంగా దారుణం. ఈ విషయం అప్పటి సెన్సార్ అధికారిని అడిగా, అసలు అందులో ఎలాంటి సన్నివేశాలు లేవు. మీరు ఎందుకు ‘ఎ’ రేటింగ్ ఇచ్చారు అని. అంటే ఇది హరర్ సినిమా కదా, అందుకే ఇచ్చానని చెప్పారు. పోనీ హర్రర్ సినిమా, రక్తపాతం ఏదైనా ఉందా అంటే అదీ లేదు. సినిమా చాలా క్లిన్‌గా ఉంటుంది. ఆ సినిమాకు అప్పటి సెన్సార్ అధికారి కావాలనే ‘ఎ’ ఇచ్చి తీవ్ర నష్టం కలిగించారు. ఆ సినిమాకు కేవలం ‘ఎ’ రేటింగ్ ఇవ్వడంవల్ల డిస్ట్రిబ్యూటర్స్‌కు రెండు మూడు కోట్ల నష్టం వాటిల్లింది. ఆ సినిమా రెండు రోజులలో విడుదలవుతుంది అన్నప్పుడు ‘ఎ’ రేటింగ్ ఇచ్చారు. చాలా థియేటర్స్‌లో చిన్న పిల్లలకు సినిమా చూసే అవకాశం లేదని చెప్పడంతో చాలామంది ఆ సినిమా చూడకుండా తిరిగి వెళ్లిపోయారు. అలా చాలా నష్టం వాటిల్లింది. సెన్సార్ అధికారులు సినిమాకు సెన్సార్ అధికారంతో కాకుండా పర్సనల్‌గా తీసుకుని సినిమా చేస్తున్నారు. వారి ఇష్టం వచ్చినట్లు రేటింగ్స్ ఇస్తున్నారు. రాజ్యాంగపరమైన స్వేచ్ఛా హక్కులను కాలరాస్తున్నారు? ఏ దేశంలో అయినా సెన్సార్ అనేది ఒక సినిమాకు ఫిలిం సర్ట్ఫికెట్ బోర్డుగానే ఉంటుంది కాని ఇక్కడ అలా కాదు. ఆ సినిమా సమయంలో మీ రూల్స్ ఒక్కసారి చూపించండి అని అడిగాను కూడా. కాని అధికారి మాత్రం మీకు చూపించాల్సిన అవసరం లేదని చెప్పాడు. సినిమాకు ముందే డేట్ అనుకున్నాం కాబట్టి ఆ సినిమా విషయంలో ఇంకా పై అధికారుల వరకు వీలైతే కోర్టుకు వెళ్లాలని అనుకున్నా కాని ఎందుకులే అనవసరంగా రిస్క్ అని ఆగిపోయా. సెన్సార్‌లో వారి ఇష్టానుసారంగా ఉన్న రూల్స్ వల్ల నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫిలిం మేకర్స్ టాలెంట్‌ని, వారి క్రియేటివిటీని అణచివేస్తున్నారు. ‘ఉడ్తా పంజాబ్’ సినిమా విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పుతో అయినా సెన్సార్‌లో నిబంధనలు మారాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను.

-కోన వెంకట్, రచయిత, నిర్మాత