ఫోకస్

ఆలోచనలకు సంకెళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా అనే వ్యవస్థను నియంత్రించడానికి ప్రభుత్వం ఏర్పరచిన ఓ విధానం సెన్సార్. అయితే ఆ వ్యవస్థకు వున్న రూల్స్ రెగ్యులేషన్స్ మాత్రం మంచి సినిమాకు ప్రోత్సాహాన్ని ఇవ్వడంలేదు. సినిమా నిర్మించే ప్రతి కళాకారుడికి, దర్శకుడికి సామాజిక బాధ్యత వుంది. సెల్ఫ్ సెన్సారింగ్ అనేది ప్రతి కళాకారుడికి మైండ్‌లో ఎప్పుడూ ఉండాలి. అది లేకుండా గవర్నమెంట్ ఓ రూల్ పాస్ చేసింది కనుక దానిప్రకారమే సినిమా తీద్దాం అనుకోవడమూ కరెక్టు కాదు. దర్శక నిర్మాతల మైండ్‌సెట్ కూడా మారాలి. ఏ కళాకారుడైనా సమాజంపట్ల బాధ్యతతో మంచిచిత్రం నిర్మించడానికే ప్రయత్నిస్తాడు. దానికి అడ్డంకులు ఎదురైతే ఎవరికి చెప్పాలి. ప్రధానమైన కళారూపాలలో మొదటి స్థానం సినిమాదే. దీని ప్రభావం కూడా చాలా గొప్పది. అక్కడ ప్రభుత్వం సెన్సార్‌ని ఉపయోగించి ‘ఉడ్తాపంజాబ్’ను అన్ని బాధలు పెట్టిందనేది హర్షించదగినది కాదు. అది ఓ రకంగా కళాకారుల ఆలోచనలకు సంకెళ్లు వేయడం లాంటిదే. సంకెళ్లు వుండడంలో తప్పులేదు కానీ, మంచి సినిమాలు తీసే విషయంలో కూడా ఇంత నిర్దయగా వ్యవహరించడం బాగోలేదు. భావప్రకటన స్వేచ్ఛపై అక్కడున్న ప్రభుత్వాలు ఇలా చేయడం అప్పుడప్పుడు చూస్తూనే వున్నాము. సెన్సార్ అనేది నిర్దిష్టంగా ఇలా వుండాలి అనే విషయంపై క్లారిటీ లేదు. ఇరాన్ దేశంలో ప్రభుత్వమే అసభ్యత, అశ్లీలం, హింసలేని చిత్రాలను రూపొందిస్తే అనేక రాయితీలు ఇస్తోంది. ప్రోత్సాహాలు కలిగిస్తోంది. అలా విననివాళ్లకి శిక్షలూ విధిస్తోంది. అక్కడ తన, పర తేడాలు లేకుండా సెన్సార్ విధానాలను అవలంభిస్తున్నారు. కానీ ఇక్కడలా జరగడంలేదు. ఉడ్తా పంజాబ్ చిత్రానికి ఇన్ని కట్స్ ఇవ్వడం మాత్రం హర్షించదగిన విషయం కాదు. సామాజిక రుగ్మతలమీద చిత్రాన్ని రూపొందిస్తే, అది దర్శక నిర్మాతల ఆలోచనలపై ప్రభుత్వం చేసిన దాడికిందే లెక్క. సినిమాల్లో విచ్చలవిడిగా సెక్స్ దృశ్యాలు వుంటే సర్ట్ఫికెట్లు ఇచ్చేస్తున్నారు. మరి అలాంటప్పుడు సెన్సార్‌వారికి నైతికత ఎక్కడుంది? ఇలా మంచి సినిమా విషయంలో తప్పు చేస్తే ప్రపంచంలో వున్న ఏ కళాకారుడైనా వ్యతిరేకించవలసిందే!

- బాబ్జీ, దర్శకుడు, హైదరాబాద్