ఫోకస్

సెన్సార్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వానికి సెన్సార్ చేసే అధికారం లేదు. పూర్వం సెన్సార్ బోర్డ్ ఉండేది. బోర్డును సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసిన తర్వాత ‘కిస్సాకుర్సీకా’ అనే చిత్ర వివాదంతో దాన్ని తొలగించేసారు. అంటే ప్రభుత్వానికి సెన్సార్ చేసే హక్కులేదని. అప్పుడు సెన్సార్ బోర్డ్ సర్ట్ఫికేషన్ అని కొత్త బోర్డ్‌ను పెట్టి, దానికి సెల్ఫ్ సెన్సార్‌లా, సమాజంలో అన్ని రంగాలకు సంబంధించిన ఉన్నతశ్రేణి వ్యక్తులను ఎంపిక చేసి, వాళ్లు ఆ సినిమాను చూసి, ఇది పబ్లిక్ చూడదగినదా లేదా అని చెప్పాలి. మైనర్ పిల్లలు చూడకూడదా లేదా అని నిర్ధారించే హక్కు ఆ కమిటీకి ఇచ్చారు. ఆ కమిటీలో వారు ప్రజలే! ఈ వివాదాన్ని అమలుపరచడానికి సెన్సార్ రీజనల్ ఆఫీసర్‌ను, చైర్మన్‌ను వేసారు. సెన్సార్ అధికారి పనల్లా ఏంటంటే, ఈ సినిమా చూసిన సభ్యులు, సమాజానికి సంబంధించిన సభ్యులు ఇచ్చినటువంటి కట్స్‌ని, రూల్స్ ప్రకారం అవి ఉన్నాయా లేదా అని చూసి, వాళ్ల అభిప్రాయాలు తీసుకుని, సర్ట్ఫికేట్ ఇవ్వడం అతని పని. సభ్యులు వద్దు అంటే మానెయ్యాలి. అంతేతప్ప, అధికారి ప్రమేయం లేదు. అతన్ని ఇన్‌ఫ్లుయన్స్ చేయడానికి వీలులేదు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ అధికారులే ఎక్కువగా వేలుపెట్టి, అసలు గవర్నమెంటే సెన్సార్ చేస్తుందన్న ఒక తప్పుడు అభిప్రాయాన్ని నిర్మాతలకు కలుగజేసారు. ఈ సెన్సార్‌లో ఉన్న సభ్యులు కూడా ‘ఉన్నతశ్రేణి సభ్యులు’ అన్న మాట పోయి, ‘పొలిటికల్ అనెంప్లాయాస్’ను ఎక్కువగా ఎంపిక చేయడం జరుగుతోంది. ఒక ఎంపీ కొందరు సభ్యులను వేయమంటారు. మరో ఎంపీ మరో కొంతమంది సభ్యులను వేయమంటాడు. అలా పొలిటికల్ అనెంప్లారుూస్‌ను తీసుకొచ్చి దీంట్లో నింపి, ఎలాంటి అనుభవం లేనివాళ్లను సభ్యులుగా చేస్తున్నారు. ఇలా చేసి ఈ సెన్సార్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ముంబయిలో సెన్సార్ విధానం ఓ రకంగా, హైదరాబాద్‌లో, చెన్నైలో మరో విధంగా ఉంటుంది. ఒక సినిమాకు ఒక విధంగా ఉంటుంది కమిటీ. మరో సినిమాకు మరో విధంగా ఉంటుంది కమిటీ మారితే! ఇలా సెన్సార్ అనేది అస్తవ్యస్తంగా ఉన్నమాట వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఉడ్తా పంజాబ్’ చిత్రానికి 90దాకా కట్స్ ఇచ్చారు. అన్ని కట్స్‌కు గురయితే అది సినిమా అవుతుందా? అది ‘ప్యాచస్’ అవుతుంది. అందుకు టోటల్‌గా సినిమా ‘ప్రోటాలిటీ ఆఫ్ సినిమా’ను గుర్తించగలగాలి. సినిమాను ముక్కలుముక్కలు చూసి బేరీజు వేయకూడదు. సినిమాను సినిమాగా చూడాలి. ఈ చిత్రం సమాజంపై ప్రభావాన్ని చూపిస్తుందా లేదా అని ఆలోచించాలి. ఏదో ప్రయోజనం ఆశించే అలాంటి చిత్రాలు తీస్తారు అని గమనించగలగాలి. ఆ చిత్రంలో ఉన్న ప్రధానమైన విషయాన్ని వదిలేసి, ‘పంజాబ్’ అనే పేరు తీసెయ్యండీ... ఇంకోటీ తీసెయ్యండి అని చెప్పడం కరెక్టుకాదు. ఆ చిత్రంపై సరైన నిర్ణయం హైకోర్టు, సుప్రీంకోర్టు తీసుకున్నాయి. ఈ సంఘటనతోనైనా సెన్సార్‌వారు కొంచెం ఆలోచించాలి.

- దాసరి నారాయణరావు, సినీ దర్శకుడు