ఫోకస్

కేంద్ర సహాయం తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగా నీటి పారుదల ప్రాజెక్టులు రావాలి. కానీ ముంపు లేకుండా చూడాలి. అదే బిజెపి విధానం. ఈ విషయంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టతతో ఉన్నది. ప్రాజెక్టు వల్ల ఒక ఇల్లు, ఒక గ్రామం ముంపునకు గురైతే ప్రత్యామ్నాయంగా నిర్మించాలి. నిర్వాసితులు నష్టపోరాదు. ప్రజలకు నష్టం జరగరాదన్న ఉద్దేశంతో మేము మాట్లాడితే ప్రాజెక్టులు రాకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయంటూ అధికార పార్టీ గగ్గోలు పెడుతున్నది. మంత్రులు రుసరుసలాడుతున్నారు. ప్రాజెక్టులను ఏనాడూ మేము వ్యతిరేకించ లేదు. దీనిని అధికార పార్టీ, మంత్రులు అర్థం చేసుకోవాలి. ప్రాజెక్టుల కింద భూములు, ఇండ్లు ఆస్తులు నష్టపోయిన నిర్వాసితులకు మేలు చేకూర్చేందుకు 2013లో కేంద్రం చట్టం చేసింది. కాగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా 123 జివోను విడుదల చేసింది. మల్లన్న సాగర్‌ను ఉదాహరణగా తీసుకున్నా 14 జనావాసాలకు చెందిన వేలాది మంది ఆందోళన చెందుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు కృష్ణా, గోదావరి నదులు జీవ నదులుగా ఉన్నాయి. ఈ జలాలను సద్వినియోగం చేసుకోవాలి. రెండేళ్ళ క్రితం వరకూ తెలుగువారంతా కలిసి ఉన్నారు. నాడు ఉద్యమం తీవ్రదశలో ఉన్నప్పుడు విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఆశించారు. విడిపోయిన తర్వాత ఇరు రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉంది. ఈ సమయంలో నదీ జలాల విషయంలో గొడవ పడడం మంచిది కాదు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీశ్ రావు, ఆంధ్ర ప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ పరస్పరం విమర్శలు చేసుకోవడంతో ప్రజలకు ఆందోళన కలిగించింది. నీటి వాటా విషయంలో వివాదం లేకుండా ట్రిబ్యునల్ ముందు పరిష్కరించుకోవాలి. అయినా వివాదం పరిష్కారం కాకపోతే కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలి. అంతేకానీ తీవ్రమైన విమర్శలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టించవద్దు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఇదివరకే చెప్పారు. అందుకే ఒక ‘టీం’గా అందరమూ కలిసి పని చేద్దాం అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆ ప్రకారం నడుచుకుంటే అందరికీ మంచిది.

- డాక్టర్ కె. లక్ష్మణ్, అధ్యక్షుడు, టి.బిజెపి