ఫోకస్

జలాలపై రాజకీయం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటలు కూడబెడితే వ్యక్తికి మంచిది... డబ్బు కూడబెడితే పిల్లలకు ఉపయోగం... జలాలు కూడబెడితే యావత్ జాతికి ప్రయోజనం. కృష్ణా జలాలపై ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదు. ప్రస్తుత పాలకులకు మల్లన్నసాగర్ వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులపై తీసుకుంటున్న శ్రద్ధ, టిఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పడంపై చూపుతున్న ఆసక్తి కృష్ణా జలాలు రప్పించడంపై లేదు. నీరు అందరికీ అవసరమే, సరిహద్దు రాష్ట్రాల వివాదాలు మానాలి. జలాలపై రాజకీయ జోక్యం ఉండకూడదు. జలాలకోసం ఆంధ్రా, తెలంగాణ అనే ప్రాంతీయ విభేదాలు మానాలి. కృష్ణాజలం ప్రధానంగా మహరాష్ట్ర నుంచి వస్తుంది. రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు మహరాష్ట్ర సర్కార్‌తో జరుపుతున్న చర్చలకు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. విభజించి పాలించే తత్వాన్ని లోక్‌సత్తా ఖండిస్తుంది. జలాలకోసం జగడం మానాలి. జలసిరి అందరికీ దక్కాలి. రైతులకు మేలు జరిగేలా.. ప్రజల దాహర్తి తీరేలా.. కరువును నివారించగలిగేలా.. పరిష్కారాన్ని వెతకాలి. వీలైనంత త్వరగా కృష్ణా జలాలను రప్పించే ప్రయత్నం జరగాలి. స్వప్రయోజనాలను పక్కన పెట్టి, రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి. సాధ్యమైనంత మేరకు కృష్ణా జలాలపై వివాదానికి స్వస్తి పలికి, జల సంపదను ఎలా కాపాడుకోవాలి.. ఎలా వినియోగించుకోవాలి.. అనే కోణంలో ఆలోచించి ప్రజాప్రయోజనాలకు దోహదపడే చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి టిఆర్‌ఎస్ పార్టీపైనే దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర సీనియర్ నాయకులంతా టిఆర్‌ఎస్‌లో చేరారు. ఇంకెవరున్నారని పార్టీ వలసలపై దృష్టి పెడుతున్నారు? ఇంతటితో వలస రాజకీయాలకు స్వస్తి పలికి ప్రస్తుతం మనముందున్న జలాల జఠిల సమస్యను అధిగమించేందుకు కృషి చేయాలని లోక్‌సత్తా తరఫున కోరుతున్నాం.

-పాండురంగారావు లోక్‌సత్తా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు