ఫోకస్

సీమకు అన్యాయం సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణా నదిలో నీళ్లే లేవు. మహారాష్ట్ర, కర్నాటక గతంలో ఎడాపెడా ప్రాజెక్టులు కట్టేవి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కడుతోంది. బ్రిజేష్ ట్రిబ్యునల్ వివరాలు ప్రకటించాల్సి ఉంది. సుప్రీం కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాల్లో వాటా కోసం వెళ్లింది. ఇవన్నీ తేలేవరకు బచావత్ ట్రిబ్యునల్ అమలులో ఉంటుంది. ఆల్మట్టి నుంచి దిగువన ఉన్న నాగార్జునసాగర్ వరకు అన్ని జలాశయాలు ఎండిపోయి ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు రాజకీయ ఘర్షణలు, మనస్పర్ధలు మాని సామరస్యంగా జల వివాదాలను పరిష్కరించుకోవాలి. రాయలసీమ సాగునీటి ప్రయోజనాలకు భంగం కలిగితే ఊరుకునే ప్రసక్తిలేదు. చంద్రబాబు ప్రభుత్వం కూడా రాయలసీమ ప్రయోజనాలను పణంగా పెట్టి కెసిఆర్‌తో రాజీపడితే తగిన గుణపాఠం చెబుతాం. శ్రీశైలంలో 854 అడుగులు నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా సాగునీరు రాయలసీమకు అందుతుంది. కాని కెసిఆర్ ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్ వాటర్ వద్ద రంగారెడ్డి- పాలమూరు ఎత్తిపోతల స్కీం కట్టి 800 అడుగుల వద్ద నీటిని తోడితే రాయలసీమ నోట్లో మట్టి పడుతుంది. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు ఉన్నాయి. దిగువన ప్రకాశం బ్యారేజీ కింద కృష్ణా డెల్టా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత కట్టే కొత్త ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేవు. ఇవన్నీ అక్రమ ప్రాజెక్టులే. కృష్ణా బోర్డుకు అధికారాలు ఇవ్వాలి. అన్ని ప్రాజెక్టులను కృష్ణా బోర్డు నిర్వహించాలి. రెండు ప్రభుత్వాలు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటాయనే నమ్మకం ప్రజలకు లేదు. శ్రీశైలం ప్రాజెక్టు కొన్ని సంవత్సరాలుగా ఎగువ నుంచి వచ్చే కృష్ణా జలాల కంటే తుంగభద్ర నుంచి వచ్చే నీటితో కళకళలాడుతోంది. అంటే రాయలసీమ ప్రాంతంలో పడే వర్షాల వల్లనే తుంగభద్ర ద్వారా శ్రీశైలంకు నీరు వెళుతోంది. గత రెండేళ్లుగా సాలీనా వంద టిఎంసి నీరు తుంగభద్ర ద్వారా శ్రీశైలంకు చేరింది. ఈ నేపథ్యంలో రాయలసీమ సాగునీటి ప్రయోజనాలను విస్మరిస్తే ఇక్కడి రైతాంగం దెబ్బతింటుంది.

- విశే్వశ్వరరెడ్డి వైకాపా శాసనసభాపక్ష ఉపనేత