ఫోకస్

చిల్లర రాజకీయాలు మానండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిన విషయం వాస్తవమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణకు కృష్ణా నదీ జలాల కేటాయింపు అవసరం కూడా ఉంది. దీనికోసం ప్రభుత్వం ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే రీతిలో ఇరు ప్రాంతాల ప్రజల మధ్య పంచాయితీలు పెట్టే విధంగా కాకుండా కేంద్ర ప్రభుత్వంతో చర్చించుకుని, తర్కించుకుని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉన్న సమస్య.
దీనిని పక్కన పెట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వారి మంత్రివర్గ సహచరులు పరస్పరం దూషించుకోవడం సమంజసం కాదు. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు విఫలమై ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి వివాదాన్ని జఠిలం చేస్తున్నారు. టిఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో ఒక్క రోజైనా ఎందుకు ప్రశ్నించి, కార్యకలాపాలను స్తంభింపజేయలేదు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు ముఖ్యమంత్రి కెసిఆర్ వెళ్ళినప్పుడు నదీ జలాల విషయాన్ని పరిష్కరించాల్సిందిగా ఎందుకు కోరలేదు. హైకోర్టు డివిజన్ విషయంలో కూడా అలాగే చేస్తున్నది. పార్లమెంటులో ఎందుకు ప్రస్తావించడం లేదు. న్యాయవాదులను రెచ్చగొట్టి రోడ్లపైకి పంపించడం భావ్యం కాదు. నదీ జలాల వాటా విషయంలో కేంద్రం వద్ద మీ బలం సరిపోకపోతే అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీ తీసుకెళ్ళాల్సిందిగా మా పార్టీ మొదటినుంచీ చెబుతున్నది. కానీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ‘నీవు కొట్టినట్లు చేయి, నేను ఏడ్చినట్లు చేస్తా..’ అనే చందంగా డ్రామా చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారు. ప్రజల మధ్య సెంటిమెంట్‌ను రగిల్చి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు. కృష్ణా నదీ జలాల్లో 150 టిఎంసిల మిగులు జలాలు వినియోగించుకోవడానికి సరిపడే ప్రాజెక్టుల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక రూపొందించుకున్నది. తెలంగాణ ప్రభుత్వం కూడా సుమారు 70 టిఎంసిలు వినియోగించుకోవడానికి వీలుగా ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉంది. అయితే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారం అసలు మిగులు జలాలు లేవు. తెలంగాణకు మిగులు లేదు. అయినా లేని నీళ్ళకోసం పంచాయితీ పెట్టుకుంటున్నారు. ఈ పంచాయితీ రావడానికి కారణం అర్థం పర్థం లేని రీ-డిజైనే్ల. పాలమూరు-రంగారెడ్డి రీ-డిజైన్ కూడా ఒక భాగమే. జూరాల నుంచి శ్రీశైలం డ్యాం ఇన్‌టేక్ పాయింట్ మార్చి, వందల టిఎంసిలు ఆంధ్రకు మళ్ళిస్తున్నట్లు అపోహలు సృష్టించడం సమంజసం కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనే నీటి కేటాయింపు, పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది. అయినా అవసరం లేని రిజర్వాయర్లు నిర్మించి అటు ఆంధ్రలో అభద్రతాభావం, తెలంగాణకు అప్పుల భారం పెంచడం జరుగుతున్నది. నీటి విషయంలో సామాజిక అభద్రతా భావం సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని ఇరు రాష్ట్రాల పాలకులు భావించడం భావ్యం కాదు.

- డాక్టర్ శ్రవణ్ దాసోజు, ముఖ్య అధికార ప్రతినిధి, టి.పిసిసి