ఫోకస్

విపక్షాలతో చర్చించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణా జలాల పంపిణీ విషయంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు విపక్షాల అభిప్రాయం తీసుకునేందుకు తక్షణం ఎపి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్షం సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఏ ప్రభుత్వమైనా ప్రజాస్వామ్య విధానాలకు విలువ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా, తెలంగాణ ప్రభుత్వమైనా కృష్ణా జలాలతోసహా వివిధ ప్రజా సమస్యలను పరిష్కరించే సమయంలో ఏవైనా ఇక్కట్లు, ఇబ్బందులు వస్తే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలి. విపక్షాల అభిప్రాయాలు తీసుకోవడం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయం తీసుకున్నట్టే. ఎన్నికల్లో ప్రజలు తమ ఓట్లను అన్ని పార్టీలకు వేస్తుంటారు. ఎక్కువ ఓట్లు పోలైన అభ్యర్థులు గెలిచినట్టు ప్రకటిస్తారు. ఇతర పార్టీల అభ్యర్థులకు కూడా కొన్ని ఓట్లు పోలవుతాయి. అందువల్ల ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకునే సమయంలోకాని, సమస్యలు ఎదురైనా సమయంలో కాని ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వాలి. అన్ని పార్టీల అభిప్రాయం తీసుకోవడం వల్ల ప్రజాభిప్రాయం ప్రతిబింబిస్తుంది. దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు కాని, చంద్రశేఖరరావు కాని విపక్షాలకు, స్వపక్షానికి విలువ ఇవ్వడం లేదు. అంతా ఏకపక్షంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది సరైన విధానం కాదు. కృష్ణా జలాలపై నేడు పెద్దఎత్తున రాద్ధాంతం జరుగుతోంది. ఇప్పటికే ఉభయ రాష్ట్రాల నీటిపారుదల శాఖల మంత్రులు కేంద్ర జలవనరుల మంత్రి నేతృత్వంలో సమావేశమై చర్చలు జరిపారు. చర్చలు జరపడం శుభపరిణామం. ఒక్కరోజు లేదా రెండు రోజుల్లో జరిగే చర్చలవల్ల సమస్య పరిష్కారం అవుతుందని భావించలేం. ప్రధానమైన అంశాల్లో అధికారులు, మంత్రుల స్థాయిలో చర్చలు జరపడం ప్రజాస్వామ్య విధానాలకు అనుగుణంగానే జరిగినట్టు భావించాలి. మంత్రుల స్థాయిలో పరిష్కారం లభించకపోవడం వల్ల ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరపాలి. కృష్ణా జలాల వినియోగం కోసం ఇప్పటికే బచావత్ అవార్డు, బ్రిజేష్ కమిషన్ తీర్పు వచ్చాయి. నీటి కేటాయింపులో ఏ రాష్టమ్రైనా అన్యాయం జరిగినట్టు భావిస్తే, చట్టపరంగా అనేక మార్గాలున్నాయి. చర్చలవల్ల సమస్య పరిష్కరించుకోవడం ఉత్తమమైన మార్గం. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారుల సహకారాన్ని, సహాయాన్ని, అభిప్రాయాలను తీసుకుని ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరపడం వల్ల సత్ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు. చర్చలు జరిపేందుకన్నా ముందే రెండు రాష్ట్రాలకు చెందిన అఖిలపక్షం సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించడం వల్ల పరిష్కార మార్గాలు లభిస్తాయి.

- చెరుపల్లి సీతారాములు సిపిఎం కార్యదర్శివర్గ సభ్యుడు, తెలంగాణ.