ఫోకస్

‘కృష్ణా’కయ్యం..పరిష్కారమయ్యేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదం కొనసాగుతోంది. మంత్రుల స్థాయిలో జరిగిన భేటీలో ఇరు రాష్ట్రాలూ పట్టువీడకపోవడంతో వ్యవహారం కొలిక్కి రాలేదు. రెండుసార్లు భేటీ అయినా ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడంతో కృష్ణా నదీ జలాల పంపిణీలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించుకునే క్రమంలో జూలై 5వ తేదీన మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణ, నీటి యాజమాన్యం గురించి జూన్ 21న కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన భేటీలో కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేయడం, ఏ రాష్ట్రం పరిధిలోని కాల్వల నిర్వహణ ఆ రాష్ట్రానికే అప్పగించడంపై ఆంధ్రప్రదేశ్ పట్టుబడుతుండగా, నీటి కేటాయింపులే జరగకుండా బోర్డు పరిధిని ఎలా నిర్దేశిస్తారని తెలంగాణ ప్రశ్నిస్తోంది. కృష్ణా జలాల తుది కేటాయింపులను ట్రిబ్యునల్ ప్రకటించే వరకూ ప్రాజెక్టుల వారీ కేటాయింపులు చేయడం సాధ్యం కాదని తెలంగాణ చెబుతోంది. గత ఏడాది చేసుకున్న తాత్కాలిక ఒప్పందానికి అదనంగా జలాలు తమకు కేటాయించాలని కోరింది. కృష్ణా జలాల్లో ప్రస్తుతం ఎపికి 512 టిఎంసిలు, తెలంగాణకు 299 టిఎంసిలు కేటాయించారని, వాస్తవానికి తెలంగాణకు 408 టిఎంసిలు కేటాయించాలని ఆ రాష్ట్రం కోరుతోంది. ఎపి పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించినందున నాగార్జున సాగర్ ఎగువన తమకు 45 టిఎంసిల వాటా ఇవ్వాలని స్పష్టం చేసింది. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకించిన తెలంగాణ ప్రస్తుతం ఉన్న విధానానే్న కొనసాగించాలని అంటోంది. బోర్డు పరిధిని నోటిఫై చేయకపోతే తమ పరిధిలో ఉన్న సాగర్ కుడికాల్వ హెడ్‌వర్క్సును తామే నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. పోలవరం ద్వారా కృష్ణాలోకి మళ్లించే 80 టిఎంసిల్లో కర్నాటక, మహారాష్టల్రకు 35 టిఎంసిలు, మిగిలిన 45 టిఎంసిలు నాగార్జున సాగర్ ఎగువ భాగంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోవాల్సి ఉంది. తెలంగాణ వాదనలను ఆంధ్రప్రదేశ్ తిప్పికొట్టింది. ఆ రాష్ట్ర వాదనల్లో తర్కమే తప్ప లాజికల్ కోణం లేదని అంటోంది. గత ఏడాదిలానే కృష్ణా జలాల్లో ఎపికి 512 టిఎంసిలు, తెలంగాణకు 299 టిఎంసిలు వాటాగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. నదీ జలాల పంపిణీ పర్యవేక్షణకు కృష్ణా బోర్డు పరిధిలోనే ప్రాజెక్టులు ఉండాలని తెగేసి చెప్పింది. నీటిని విడుదల చేసుకునేందుకు అధికారులు వెళ్తుంటే తెలంగాణనుండి దాడులు జరుగుతున్నాయని ఆంధ్రా వాదిస్తోంది. పట్టిసీమను నిర్మించినందున గోదావరి జలాలకు బదులు కృష్ణా జలాల్లో 45 టిఎంసిల్లో వాటా ఇచ్చేది లేదని కూడా ఆంధ్రా స్పష్టం చేసింది. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌లో ఈ నీటికి సంబంధించి ఏం చెప్పారో పరిగణనలోకి తీసుకుని వచ్చే సమావేశంలో ఒక అభిప్రాయానికి వచ్చే వీలుందని ఇరు రాష్ట్రాలూ యోచిస్తున్నాయి. కృష్ణా జలాల వివాదంపై కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.
* * *