ఫోకస్

న్యాయవాదులకు మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైకోర్టు విభజన అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో దీక్ష చేస్తానని చెప్పడం ఏ విధంగా సబబు? కెసిఆర్ కావాలనుకుంటే అమరావతిలో దీక్ష చేయాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కలిసి తేల్చుకోవల్సిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని లాగడం, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదు. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్యకు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ముందుకు రావాలి. తెలంగాణ న్యాయవాదుల ఉద్యమానికి బిజెపి మద్దతు ఎపుడూ ఉంటుంది. ఇప్పటికే ఈ వివాదంపై కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోరాం. టిఆర్‌ఎస్, తెలుగుదేశం పార్టీలు సమస్యను పక్కదారి పట్టించి కేంద్రంపై నిందలు మోపుతున్నాయి. గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులూ చాలాసార్లు కలుసుకున్నారు... అలాంటప్పుడు ఈ విషయంపై ఎందుకు మాట్లాడుకోలేదు? హైకోర్టులో ధనగోపాల్ అనే వ్యక్తి వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో తీర్పు ఇస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్, సెక్షన్ 31 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హైకోర్టు ఆ రాష్ట్ర పరిధిలో ఏర్పాటు చేయాలని, తాత్కాలికంగానైనా హైకోర్టును హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి వీలులేదని పేర్కొంది. టిఆర్‌ఎస్ నేతలు సెక్షన్ 31 గురించి పార్లమెంటులో ఎందుకు మాట్లాడలేదు? ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు నిర్మాణాన్ని చేపట్టి ఆరు నెలల్లోగా వౌలిక సదుపాయాలు కల్పించాలని 2015 మే నెలలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాని నేటివరకూ ప్రభుత్వం సచివాలయాన్ని తరలించడంలో ఎలాంటి శ్రద్ధ వహించలేదు. న్యాయవాదులు భావావేశాలకు లోను కాకుండా శాంతియుతంగా తమ నిరసన చేపట్టాలి. వారి న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు బిజెపి వెన్నంటే ఉండి సహకరిస్తుంది.

- డాక్టర్ కె. లక్ష్మణ్ తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు