ఫోకస్

ప్రోత్సహించినవారికే చిక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగ్రవాదం మన దేశానికే కాదు అంతర్జాతీయ సమస్యగా మారింది. ప్రపంచ దేశాలకు పెను సవాల్‌గా మారింది. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాల్సిందే. ఉగ్రవాదం అభివృద్ధికి ఆటంకం అవుతుంది. ఉగ్రవాదాన్ని అమెరికా లోగడ ప్రోత్సహించి, చివరకు చిక్కుల్లో పడింది. ఆ చేదు అనుభవం అమెరికాకే ఎదురైంది. ఉగ్రవాదులు వివిధ దేశాల్లో ఆంతరంగికంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారు. ఇరాక్‌లోనూ అమెరికా అదేవిధంగా ప్రోత్సహించింది. అఫ్గనిస్తాన్‌లోనూ రష్యాకు వ్యతిరేకంగా అమెరికా ప్రోత్సహించింది. మనదేశంలో ఉగ్రవాదం పెరుగుతున్నది. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. అన్యాయం జరిగినప్పుడు కూడా తీవ్రవాదం పెచ్చరిల్లుతుంది. అక్షరాస్యత లేకపోయినా, నిరుద్యోగ సమస్య ఉన్నా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. అంతేకాకుండా కొన్ని రాజకీయ వర్గాలూ తమ స్వార్థప్రయోజనాలకోసం ఇటువంటి వాటిని ప్రోత్సహించడం బాధాకరం. రాజకీయ పార్టీల మద్దతు లేకపోతే తీవ్రవాదాన్ని తుదముట్టించడం సాధ్యం కాదు. ప్రధాని నరేంద్ర మోదీ మాటలు చాలా చెప్పారు, కానీ చేతల్లో చూపించడం లేదు. ఎన్నికల తర్వాత అచ్చేదిన్ ఆగయ్ (మంచి రోజులు వచ్చాయి) అన్నారు. నిజమే ఎవరికి మంచి రోజులు వచ్చాయి? ముస్లిం, మైనారిటీలకు మాత్రం కాదు. ఎన్నో పథకాలు ప్రకటించినా, అవి ఆచరణలోకి రాలేదు. చరిత్ర పుటలను తిరగేస్తే నాడు అక్బర్, షాజహాన్ కాలంలో హిందు-ముస్లింలు కలిసి ఉన్నారు. ఆ చక్రవర్తులు హిందు-ముస్లిం, సిక్కులను సమానంగా చూశారు. అందుకే అది స్వర్ణయుగం అంటారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో ముస్లింలు అసువులుబాసారు. కానీ నేడు సైనిక దళాల్లో ముస్లింలకు చోటే లేదు. దేశంలో ముస్లింలు 15 శాతం ఉన్నా, సైన్యంలో ఒక్క శాతం కూడా అవకాశం లేకుండా చేశారు. ఉన్నత విద్యను అభ్యసించినా వారికి సరైన అవకాశాలు లేవు. రాజకీయంగా కూడా వారు అత్యున్నతమైన స్థానాల్లోకి రాకుండా నిలువరిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో, రాజ్యాంగం కల్పించిన హక్కులనూ అమలు చేయడం లేదు. దేశంలో కుల, మతాల విభేదాలు పెరుగుతున్నాయి. ఇది దేశానికి మంచిది కాదు. హిందు-ముస్లిం ఏ మతానికి చెందిన వారైనా ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి. అప్పుడే యువత తప్పుడు మార్గాల్లోకి అడుగు పెట్టదు. దేశానికి నష్టం కలిగించాలని, తప్పుడు మార్గాలు అనుసరించాలని ఏ మతమూ బోధించదు. దేశానికి పెనుసవాల్‌గా మారిన ఉగ్రవాదాన్ని అణచి వేయడానికి అందరమూ నడుం బిగిద్దాం.

- వౌలానా సయ్యద్‌షా హమీద్ హుస్సేన్ శుత్తారీ అధికార ప్రతినిధి, అఖిల భారత సున్నీ ఉల్మా బోర్డు