ఫోకస్

ఇంటిలిజెన్స్ పటిష్ఠం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీమాంతర ఉగ్రవాదం, తీవ్రవాదం దేశంలో పెరిగిపోయాయి. ఇది అనేక రకాలుగా విస్తరించింది. ఇది ఏ దేశానికీ మంచిదికాదు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని పసిగట్టడానికి ఇంటిలిజెన్స్ వ్యవస్థను పటిష్ఠపరచుకోవాలి. ఉగ్రవాదుల శిక్షణ కేంద్రాలను మట్టుపెడితే చాలా ఘోరాలు తగ్గిపోతాయి. ఇవి ఎక్కడెక్కడ ఉన్న విషయాన్నీ ఇంటిలిజెన్స్ విభాగం మాత్రమే గుర్తించగలుతుంది. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఇంటిలిజెన్స్ విభాగం పటిష్ఠంగా ఉండాలి. ఇది సక్రమంగా పనిచేస్తే ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరించి చర్యలకు ఉపక్రమిస్తుంది. ఉగ్రవాదం ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలనూ వణికిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వీరి ఆగడాలు పెరిగిపోతున్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇప్పుడు అనేకచోట్ల విస్తరించారు. కాశ్మీర్‌లో శాంతిని నెలకొల్పేందుకు చర్చలు జరపాలని కొందరు అంటున్నారు. ఎవరితో చర్చలు జరపాలి? దేశం నుంచి విడిపోవాలనుకున్న వారితో చర్చలు ఎలా జరుపుతాం? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది. ఇటీవల హైదరాబాద్‌సహా పలు ప్రాంతాల్లో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజన్సీ పలువురు ఉగ్రవాద అనుమానితులను అరెస్టు చేశారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో నిర్మూలించేందుకు కేంద్రం అన్ని రాష్ట్రాల మధ్య సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇది కేంద్రం బాధ్యత లేదా రాష్ట్రం బాధ్యత అనుకునేందుకు వీలులేదు. బంగ్లాదేశ్‌లో ఇటీవల నరమేధం జరిగింది. ఒక మత ప్రచారకుడి ప్రవచనాలకు ఆకర్షితులయ్యామని, అందుకే దాడులకు పాల్పడ్డామని బంగ్లాదేశ్‌లో పట్టుబడిన ఉగ్రవాదులు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థలకు రకరకాల మార్గాల ద్వారా ఫండింగ్ అందుతోంది. మతం ముసుగులో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సంస్థలపై కేంద్రంసహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి నిఘా పెట్టాలి. వీరికి నిధులు చేరకుండా హవాలా మార్గాలను నిరోధించాలి. ఉగ్రవాద సంస్థలకు చెందిన వ్యక్తులు పట్టుబడినప్పుడు వారికి లీగల్‌గా సహకరిస్తామని హైదరాబాద్ ఎంపి ఒవైసీ ప్రకటించడం విచారకరం. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండేవారు జవాబుదారీతనంతో ఉండాలి. తెలంగాణలో మా పార్టీ ఒవైసీ వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేయడమేకాకుండా ఆందోళన చేపట్టింది. మతతత్వ శక్తులకు ప్రభుత్వాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాసటగా నిలిచే ధోరణులకు స్వస్తి చెప్పాలి. కుహనా లౌకికవాదాన్ని అన్ని రాజకీయ పార్టీలు విడనాడాలి. ఓటు బ్యాంకు రాజకీయాలవల్లనే మతదురంహకార సంస్థలకు బలం చేకూరుతోంది. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి బుజ్జగింపు రాజకీయాలకు, కుహనా లౌకికవాదానికి పాల్పడడంవల్ల కాశ్మీర్ సమస్యగా తయారైంది. కొన్ని మత సంస్థలు పిల్లల్లో దేశభక్తిని పెంపొందించే పాఠాలు చెప్పకుండా మతప్రవచనాల ముసుగులో ఉగ్రవాదాన్ని వ్యాపింపచేస్తున్నాయి. ఈ తరహా సంస్థలపై వేటు వేయాలి.

- కంభంపాటి హరిబాబు విశాఖ లోక్‌సభ సభ్యుడు